జేసీ కేసులో ట్విస్ట్ ... పోలీసుల పీటీ వారెంట్ ... తండ్రీ తనయుల బెయిల్ యత్నాలు ఫలిస్తాయా ?

జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన దివాకర్ ట్రావెల్స్ అక్రమాల కేసులో షాకింగ్ ట్విస్ట్ లు వెలుగుచూస్తున్నాయి. ఒకపక్క జెసి దివాకర్ రెడ్డి జెసి ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి లకు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇదే సమయంలో అనంతపురం వన్టౌన్ పోలీసులు మూడు కేసులకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి లపై సోమవారం కోర్టులో పిటి వారెంట్ వేశారు.

 రవాణాశాఖాధికారుల ఫిర్యాదుతో పోలీసుల పీటీ వారెంట్

రవాణాశాఖాధికారుల ఫిర్యాదుతో పోలీసుల పీటీ వారెంట్

ఆల్రెడీ ఒక కేసు విషయంలో జైల్లో ఉన్న వీరికి సంబంధించి, మరో కేసు విచారణకు అనుమతి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. గత సంవత్సరం తప్పుడు ఇన్వాయిస్ లతో స్క్రాప్ కింద కొనుగోలు చేసిన బిఎస్ 3 వాహనాలను నాగాలాండ్ రాజధాని కోహిమా లోనూ, అనంతపురం, ఇతర రాష్ట్రాలలో జటాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బిఎస్ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఇక ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఈ విధంగా నమోదు చేయించిన 80 వాహనాలపై రవాణా శాఖ అధికారులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, సోమవారం వన్ టౌన్ పోలీసులు కోర్టులో పీటీ వారెంట్ వేశారు.

నేడు పీటీ వారెంట్ పై విచారణ

నేడు పీటీ వారెంట్ పై విచారణ

జైలు నుండి నేరుగా పోలీసుల విచారణకు వారిని తీసుకెళ్లాలని ఉద్దేశంతోనే పిటి వారెంట్ వేసినట్లుగా తెలుస్తోంది. అయితే నేడు ఈ పీటీ వారెంట్ పై మెజిస్ట్రేట్ విచారణ జరపనున్నారు. దివాకర్ ట్రావెల్స్ కు సంబంధించిన రెండు బస్సులకు నకిలీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తో ఎన్వోసీ పొందిన కేసులో ఈ నెల 13వ తేదీన అరెస్ట్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి లకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఇక ఈ క్రమంలో కడప సెంట్రల్ జైల్ లో ప్రస్తుతం తండ్రి తనయుడు ఉన్న పరిస్థితి.

Recommended Video

    Sushant Singh Rajput : Sri Reddy Comments Viral
    బెయిల్ పై కూడా నేడే విచారణ

    బెయిల్ పై కూడా నేడే విచారణ

    ఇక వీరి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు జేసీ దివాకర్ రెడ్డి. ఈ కేసుకు సంబంధించిన బెయిల్ దరఖాస్తుపై కూడా నేడు విచారణ జరగనుంది. ఈ సందర్భంలోనే అనంతపురం వన్టౌన్ పోలీసులు పిటి వారెంట్ వేయడం చర్చనీయాంశంగా మారింది. బెయిల్ రాకుండా ఉండటం కోసమే పీటీ వారెంట్ వేశారని భావిస్తున్నారు. ఇది రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+