Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలీసులకు పులివర్తి నాని భార్య సుధారెడ్డి షాకింగ్ అల్టిమేటం

పద్మావతి యూనివర్సిటీలో చంద్రగిరి అసెంబ్లీ టిడిపి అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం తిరుపతిలో ఇంకా ఉద్రిక్తతలకు కారణమవుతుంది. పులివర్తి నానిపై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్టు చేస్తామని చెప్పిన ఎస్పీ ఇప్పుడు వారిని అరెస్టు చేయకుండా చేతులెత్తేసారని పులివర్తి నాని భార్య సుధా రెడ్డి ఆరోపించారు. వారిని అరెస్టు చేసేవరకు ఊరుకునేది లేదని, ఒకవేళ వాళ్లను అరెస్టు చేయకపోతే రేపు చంద్రగిరి మొత్తం రోడ్ల మీదే ఉంటుందని హెచ్చరించారు.

పోలీస్ స్టేషన్ ఎదుట పులివర్తి నాని భార్య సుధా రెడ్డి ధర్నా
తమ ప్రాణాలు ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసని, పోలీసులకే చంద్రగిరిలో రక్షణ లేదని ఆమె ఎద్దేవా చేశారు. నానిపై దాడి చేసిన వారిపై సాక్షాధారాలు ఇచ్చిన పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారో చెప్పాలని సుధా రెడ్డి ప్రశ్నించారు. ప్రివెంటివ్ అరెస్టు పేరుతో తమవారిని అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసి, తమ వారిని విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు.

Pulivarthy Nani wife Sudha reddy ultimatum to police to arrest the attackers of Nani

పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నాని భార్య
మీడియాతో మాట్లాడిన ఆమె పోలీసులపైన, తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నానిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయమంటే జూన్ నాలుగో తారీఖు వరకు ఓపిక పట్టమని తమకే సలహా ఇస్తున్నారని, నాలుగో తేదీ వరకు తాము ఏమీ చేయలేమని గులాంగిరి చేస్తామని ఎస్పీ చెబుతున్నారు అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులివర్తి నాని పై దాడి జరిగింది అని పోలీసులకు ఫోన్ చేసినా పట్టించుకున్న నాథుడు లేడని విమర్శించారు.

వీడియో ఫుటేజ్ ఇచ్చినా అరెస్ట్ చెయ్యలేదు .. దేనికి
ఒక సెకండ్ లేట్ అయినా సెక్యూరిటీ ధరణి లేకపోయినా నాని ప్రాణాలతో దక్కే వారు కాదని, ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన ప్రాణాలు తీస్తారా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఇంకా నిర్ధారణ కాలేదని, అప్పుడే హత్యాయత్నం చేసేదాకా వచ్చారంటూ ఆరోపించారు. దాడి చేసిన వారి వీడియో ఫుటేజ్ ఇచ్చినా ఒకర్ని కూడా అరెస్టు చేయలేదని మండిపడ్డారు.

పోలీసుల ప్రతాపం మన పైనే.. వాళ్ళనేం చెయ్యలేరు
పోలీసుల ప్రతాపం మా వాళ్ళపై, మీడియా మిత్రులపైన మాత్రమే అని, ఈరోజు మా పై దాడి చేసిన వారు రేపు ఎస్పీని కూడా కొడతారని, మీకు కష్టం వస్తే మేము వచ్చి కాపాడుకుంటాం అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇన్ని ఆధారాలు ఇచ్చిన వారిని అరెస్టు చేయలేకపోతే దేనికని ప్రశ్నించారు. వారిని అరెస్టు చేయకుంటే చంద్రగిరి మొత్తం రేపు రోడ్డుపై ఉంటుందని సుధా రెడ్డి హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+