పులివెందులలో సొంత పార్టీ కౌన్సిలర్ల పంచాయితీ, రంగంలోకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజక వర్గంలో మునిసిపాలిటీలో సొంత పార్టీ కౌన్సిలర్లు అసమ్మతి వ్యక్తం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. పులివెందుల అంటేనే వైఎస్ ఫ్యామిలీకి అడ్డా అనే విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి పులివెందులలో వైసీపీ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చెయ్యడంతో ఆ పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు.

ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లిన సమయంలో ఆ పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లు తమ బిల్లులు చెల్లించాలని, వందల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, మీరే మాకు న్యాయం చెయ్యాలని మనవి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మా బిల్లలు పెండింగ్ లో ఉండిపోతాయని వైసీపీ కౌన్సిలర్లలో ఆందోళన మొదలైయ్యింది.

Pulivendula YCP councilors are protesting to pay pending bills of contract works

పులివెందుల మునిసిపాలిటీలో పలు పనులు చేసినా ఇంత వరకు బిల్లులు చెల్లించలేదని వైసీపీ కౌన్సిలర్లు వైఎస్ జగన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారని వెలుగు చూసింది. పులివెందులలో పాడా కింద చేసిన సుమారు రూ. 240 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించకపోవడంతో వైసీపీకి చెందిన కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల మునిసిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లు ఆందోళనకు చెందడంతో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేరుగా రంగంలో దిగారు.

పులివెందుల చేరుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో చర్చలు జరిపారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారినా ఎలాంటి ఇబ్బంది లేదని, పెండింగ్ లో ఉన్న బిల్లులు పూర్తి వచ్చేలా చెయ్యడం మా బాధ్యత అని, ఒక వేళ్ల కక్షసాదింపుతో చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు చెల్లించకుంటే మనం కోర్టును ఆశ్రయిద్దామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ కౌన్సిలర్లకు హామీ ఇచ్చారని తెలిసింది.

అయితే ఇలాంటి సమయంలో పులివెందులలో సొంత పార్టీ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేస్తే తప్పుడు సంకేతాలు వెలుతాయని, మీ డబ్బు ఎక్కడికిపోదని, కచ్చితంగా బిల్లులు అయ్యేలా చూడటం మా బాధ్యత అని వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల వైసీపీ కౌన్సిలర్లకు హామీ ఇచ్చారని సమాచారం. పులివెందులలో వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చెయ్యడం ఆ నియోజక వర్గంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ అయ్యింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+