పులివెందులలో నాకు ప్రాణహాని- లోకేష్, బీటెక్ రవిదే బాధ్యతన్న సతీష్ రెడ్డి..!

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఉపఎన్నికలన్నీ ఓ ఎత్తు.. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక మరో ఎత్తుగా పరిస్ధితి మారిపోయింది. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో వైసీపీ గెలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వం పని అయిపోయిందని ఎక్కడ ప్రచారం చేస్తుందో అని టీడీపీ.. అలాగే టీడీపీ గెలిస్తే పులివెందుల కూడా ఇక మాదే అని ఎక్కడ చెప్పుకుంటుందోనన్న భయం వైసీపీలో పెరిగిపోతున్నాయి. దీంతో ఈ స్థానిక ఉపఎన్నిక కూడా ఇప్పుడు రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తోంది.

పులివెందులలో రేపు జరిగే ఉపఎన్నికకు ముందు చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తనపై దాడి జరగబోతోందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి లోకేష్, పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి ఇద్దరూ దీనికి బాధ్యులని, వారిద్దరిపై సీబీఐ సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేయాలని కోరారు.

pulivendula zptc byelection politics ysrcp leader satish reddy predicts life threat from tdp

తనపై జరగబోయే దాడి గురించి టీడీపీ నేతలే తనకు సమాచారం ఇచ్చారని సతీష్ రెడ్డి తెలిపారు. పులివెందులలో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. తన మీదకు దాడి జరగబోతున్నట్టు స్పష్టంగా కొంత మంది టీడీపీ నాయకుల ద్వారానే తనకు వర్తమానం అందిందని, తాను నిరాయుధుణ్ని అని, తనను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని డీజీపీ హరీష్ గుప్తాకు ప్రెస్ మీట్ పెట్టి సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు. తనపై కనీసం దాడి జరగకుండా చూడాలని కోరారు.

pulivendula zptc byelection politics ysrcp leader satish reddy predicts life threat from tdp

తనను పోలీసులు కాపాడలేకపోతే .. ఇందుకు కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం, లోకేష్ , బీటెక్ రవి అని, తనకు ఏం జరిగినా సుమోటోగా వీరిపై సీబీఐ విచారణ చేయించాలని సతీష్ రెడ్డి కోరారు. స్ధానికంగా ఉన్న పోలీసులతో తనకు న్యాయం జరిగే పరిస్థితులు లేవని, అక్కడున్న పోలీసులు పోలీసులే కాదని, పచ్చకండువాలు వేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. నిజాయితీపరులైన అధికారుల్ని పక్కనకూర్చోబెట్టి వీరికి పెత్తనం ఇచ్చారని, వీరివల్ల ఏమీ కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+