వైసీపీకి షాక్.. పార్టీకి కీలక నేత రాజీనామా
ఏపీలో ఎన్నికల హీట్ పెరిగింది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో టికెట్లు దక్కని నేతలు..ఆయా పార్టీలు వీడి తమకు హామీ ఉన్న పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఈక్రమంలోనే పుంగనూరు నియోజకవర్గంలో అధికార పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీకి చెందిన కీలక నేత టీడీపీలో చేరారు. వైసీపీ నేత వెంకటరమణ రాజు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.
అధినేత చంద్రబాబు సమక్షంలో వెంకటరమణ రాజుకు టీడీపీ కండువా కప్పుకున్నారు. వెంకటరమణ రాజు గతంలో పుంగనూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.మంత్రి పెద్దిరెడ్డి చేతిలో ఆయన ఓడిపోవడం జరిగింది. 2019 ఎన్నికల ఫలితాల అనంతరం వెంకటరమణ రాజు వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సమక్షంలో ఆయన తన సొంత గూటికి చేరుకున్నారు.

పుంగనూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా చల్లా బాబు పేరును ప్రకటించింది పార్టీ అధిష్టానం. ఈ సందర్భంగా వెంకటరమణ రాజు మాట్లాడుతూ.. టీడీపీ అభ్యర్థి చల్లా బాబు గెలుపు కోసం పని చేస్తానని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి ఓటమే లక్ష్యంగా పని చేయాలని స్థానిక నేతలకు చంద్రబాబు సూచించారు. ఇక మంగళవారం కూడా చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు.
సొంత నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తోన్న చంద్రబాబు, జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని.. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని చంద్రబాబు తెలిపారు. ఇక కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు పింఛన్‌పై కీలక ప్రకటన చేశారు.
టీడీపీ అధికారంలోకి రాగానే పింఛన్ నాలుగు వేలు పెంచుతామని ప్రకటించారు. ఒకటో తేదీనే పింఛన్ మీ ఇంటికి ఇస్తామని తెలిపారు.కుప్పంలో పర్యటనలో ఉన్న చంద్రబాబు స్థానిక మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కుప్పంలో డోర్ టూ డోర్ ప్రచారం చంద్రబాబు నిర్వహిస్తున్నారు. మంగళవారం కూడా కుప్పంలో పర్యటించనున్నారాయన.












Click it and Unblock the Notifications