మీరు ఆఫర్ చేశారా, మేం అడిగామా: లోకేష్‌కు పురంధేశ్వరి కౌంటర్
హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి బుధవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటును ఏపీ కోటాలో ఇవ్వాలని తాము కోరలేదని చెప్పారు.
ఆయనకు సీటు ఇవ్వాలని తాము కోరామా? లేక తెలుగుదేశం పార్టీ ఆఫర్ చేసిందా అనే విషయం టీడీపీనే అడిగి తెలుసుకోవాలని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కోరితే తాము సురేష్ ప్రభుకు సీటు ఇచ్చామని టిడిపి నేతలు చెప్పడం సరికాదన్నారు.
మంగళవారం నాడు టిడిపి యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ... ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షులు అమిత్ షా కోరితే తాము సీటు ఇచ్చామని చెప్పారు. ఈ వ్యాఖ్యలను బుధవారం నాడు పురంధేశ్వరి ఖండించారు. అయితే, లోకేష్ పేరు చెప్పలేదు.

అమిత్ షా కోరితే సురేష్ ప్రభుకు రాజ్యసభకు అవకాశం కల్పించామని టిడిపి నేతలు చెప్పడాన్ని ఆమె ఖండించారు. ఏది ఏమైనా రైల్వే మంత్రి ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లడం తెలుగు రాష్ట్రాల అదృష్టమని చెప్పారు. ఈ నెల 4న రాష్ట్రంలో కేంద్రమంత్రులు పర్యటిస్తారని చెప్పారు.
నా పదవీ కాలం ముగిసేలోపు రైల్వే జోన్: హరిబాబు
తన పదవీ కాలం ముగిసే లోపు రైల్వే జోన్ వస్తుందని విశాఖ బీజేపీ ఎంపి కంభంపాటి హరిబాబు చెప్పారు. వాల్తేరు డివిజన్ డిఆర్ఎం చంద్రలేఖను ఆయన అభినందించారు. భవిష్యత్తులో ఆయన జ్ఞానాపురం జంక్షన్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన కారు పార్కింగ్‌ను ప్రారంభించారు.












Click it and Unblock the Notifications