'పుష్ప-2' హిట్‌ను వైసీపీ ఖాతాలో వేసిన అల్లు అర్జున్

ఏపీ రాజకీయాలు మొత్తం కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా చూట్టునే తిరుగుతున్నాయి. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పకపోతే 'పుష్ప-2' సినిమాను ఆంధ్రప్రదేశ్‌లో అడ్డుకుంటామని జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు హెచ్చరించారు. బీజేపీ సైతం 'పుష్ప-2' విమర్శలు గుప్పించింది. తాజాగా సినిమాపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. సినిమాలో చూపించిందింతా కూడా ఫేక్ అని బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి తేల్చేశారు.

మరోవైపు మెగా అభిమానులు సైతం 'పుష్ప-2' సినిమాను ఫ్లాప్ చేస్తామంటూ సవాల్ విసిరారు. ఇన్ని వివాదాల నడుమ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 294 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో మొదటిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. ఈ చిత్రం మొదటి ఆదివారం నాటికి భారతదేశంలోని మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్ ₹529.45 కోట్లకు చేరుకుంది.

Pushpa-2 movie hit credit YCP

అయితే ఈ సమయంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2కు మద్దతుగా వైసీపీ నిలిచింది. చాలాచోట్ల అల్లు అర్జున్‌తో పాటు, జగన్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అభిమానులు. మా కోసం నువ్వు వచ్చావు.. మీ కోసం మేము వస్తామంటూ పుష్ప 2కు జగన్ అభిమానులు అండగా నిలిచారు. ఇక థియేటర్ల దగ్గర కూడా అల్లు అర్జున్, జగన్ ఫొటోలతో కూడిన కటౌట్‌లను ప్రదర్శించారు. సినిమా ప్రదర్శిస్తోన్న సమయంలో కూడా వైసీపీ జెండాతో జగన్ అభిమానులు హల్ చల్ చేశారు.

పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురంలో పుష్ప 2 ఫ్లెక్సీలను జనసేన కార్యకర్తలు చించివేస్తే , వైసీపీ అభిమానులు అల్లు అర్జున్ బ్యానర్‌తో సందడి చేశారు. ఇటీవల అల్లు అర్జున్ బయటకు వచ్చిన సమయంలో కూడా అతని ఎదురుగానే వైసీపీ జెండాను ఎగరవేశారు. మొదటి నుంచి కూడా పుష్ప 2కు మద్దతుగా నిలిచి ఆ సినిమా హిట్ కావడంలో జగన్ అభిమానులు కీలక పాత్ర పోషించారు. వైసీపీ మద్దతుదారుల అండగా నిలవడంతో సినిమా ఇంతటి ఘన విజయం సాధ్యం అయిందని సినీ పండితులు సైతం చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+