రోజా కూతురు ర్యాంప్ వాక్.."ఇంత అందంగా ఉందేంటి బాబోయ్"
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని, అగ్ర కథానాయికగా ఎదిగి, ఆ తర్వాత రాజకీయాల్లోనూ సత్తా చాటి ఎమ్మెల్యేగా, మంత్రిగా సక్సెస్ అయినా వైసీపీలో కీలకంగా వ్యవహారిస్తున్న రోజా సెల్వమణి గురించి తెలియని వారుండరు. సినిమాలకు దూరమైనా, రాజకీయాల్లో ఆమె చురుకుగా కొనసాగుతూ, ఆమె మాట్లాడే ప్రతి మాట ప్రత్యర్ధుల గుండెల్లో తూటాల్లా దూసుకెళ్తుంటాయి. రోజా గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు. అయితే, ఇప్పుడు చర్చ అంతా ఆమె కూతురు అన్షు మాలిక గురించే.
చిన్నతనం నుండే అన్షు మంచి ప్రతిభావంతురాలని రోజా ఎప్పుడూ చెబుతుంటారు. చిన్న వయసులోనే రచయిత్రిగా మారి కొన్ని పుస్తకాలు రచించి, పోటీలలో గోల్డ్ మెడల్స్ కూడా సాధించింది. అచ్చం రోజాకు జిరాక్స్ కాపీలా కనిపించే అన్షు మాలిక , భవిష్యత్తులో సినిమాల్లోకి వస్తుందో లేదో తెలియదు కానీ, ఆమె హీరోయిన్ మెటీరియల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా అన్షు మాలిక ఒక ఈవెంట్‌లో ర్యాంప్ వాక్ చేసింది. తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, "ఇంత అందంగా ఉందేంటి బాబోయ్, రోజా కూడా ఈమె అందం ముందు సరితూగదు" అంటూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎంతో మంది కొత్త హీరోయిన్లు సినీ రంగ ప్రవేశం చేసి, ఒకటి రెండు హిట్లతోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. వారితో పోలిస్తే అన్షు మాలిక అందం మరింత ఆకట్టుకునేలా ఉంది. నటన, డ్యాన్స్ ఎలా ఉంటాయో తెలియదు కానీ, అవి కూడా తోడైతే మాత్రం అన్షు మాలిక ఇండస్ట్రీలో తిరుగు ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె సినీ రంగ ప్రవేశం ఎప్పుడు జరుగుతుందో చూడాలి.
ఇదంతా పక్కన పెడితే, రోజా సినిమాలకు దూరమైనా, బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు 'జబర్దస్త్' న్యాయ నిర్ణేతగా మంచి క్రేజ్ సంపాదించుకున్న రోజా, మంత్రి అయ్యాక ఆ షోకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్ళీ రీ-ఎంట్రీ ఇచ్చి, జీ తెలుగులో వరుసగా రెండు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. తల్లి, కూతురిద్దరూ తమ రంగాల్లో సత్తా చాటుతుండటం విశేషం.












Click it and Unblock the Notifications