వైసీపీ సీనియర్పై గురి- రంగం సిద్ధం
Raghu Rama Krishnam Raju: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాగన్ణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల నిర్వహణపై దృష్టిపెట్టింది.
దీనిపై ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. యువజన విభాగం కమిటీ నాయకులతో సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది. పార్టీ యువనేతలకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అలవికాని హామీలను ఇచ్చి, మాట తప్పిన చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక పోరాటాలకు సంసిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ పరిస్థితుల మధ్య సజ్జల టార్గెట్ అయ్యారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి కంప్లైంట్ అందింది. సాక్షిటీవీ డిబేట్‌లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత సీనియర్ జర్నలస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ కావడంపై సజ్జల చేసిన వ్యాఖ్యలు దీనికి కారణం అయ్యాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే ఆర్గనైజ్‌డ్‌గా ఆందోళనలు, దిష్టిబొమ్మల దగ్ధాలు, చెప్పులతో కొట్టడాలు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదవుతున్నాయని సజ్జల అన్నారు. ఏడాది పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చివరికి టీవీ డిబేట్‌లోని వ్యాఖ్యలను కూడా వివాదాస్పదంగా మార్చడ ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం, సత్యసాయి జిల్లాలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై ప్రభుత్వంలో కనీస స్పందించలేదని సజ్జల ఆరోపించారు. జరిగిన దానికి జర్నలిస్ట్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు సాక్షి టీవీ యాజమాన్యం క్షమాపణలు సైతం చెప్పిందని పేర్కొన్నారు.
అమరావతి మహిళల నిరసన కార్యక్రమాలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సజ్జల అదే ప్రెస్ మీట్ లో. సంకర జాతి అని వ్యాఖ్యానించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు రంగంలోకి దిగారు.
సజ్జలపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ కు లేఖ రాశారు. సజ్జల చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఆయన తన లేఖకు జత చేశారు. అమరావతి మహిళలని సంకర జాతి అని కించ పరిచారని పేర్కొన్నారు. అమరావతి మహిళలపై కుల వివక్షకు సంబంధించిన పదాన్ని వాడారని రఘురామ అన్నారు.












Click it and Unblock the Notifications