అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజల మాటలు వింటే సీఎం గుండె ఆగుతుంది- ఆ ముగ్గురు మంత్రులను తీస్తే సంక్షోభం : రఘురామ సంచలనం..!!

|
Google Oneindia TeluguNews

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో అధికారం ఉందని..రాష్ట్రంలో చేతకాని..దద్దమ్మ..అసమర్ధ ప్రభుత్వం ఉందంటూ విమర్శించారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థే దరిద్రమని..వాళ్లకు కోట్లాది రూపాయలతో అవార్డులు ఇవ్వటం ఏంటని మండిపడ్డారు. సీఎం జగన్ కరెంటు కోతలు పెట్టి పిల్లలను ఏడిపిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేసారు. సరైన నిర్ణయాలు తీసుకోని కారణంగానే విద్యుత్ సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు.

ప్రధాని అందుకే పిలిపించారంటూ

ప్రధాని అందుకే పిలిపించారంటూ

జగన్​ దిల్లీ పర్యటనపై కామెంట్స్ చేసిన రఘురామ.. జగన్‌ను ఎందుకు పిలిచారో తనకు తెలుసునన్నారు. జగన్‌ సమయం అడిగితే ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్నారు. వైకాపా చేసిన ఆర్థిక అరాచకాలు, అప్పుల తప్పుల నేపథ్యంలో జగన్‌ను దిల్లీకి పిలిచారని అన్నారు. కార్పోరేషన్ల పేరుతో దొంగ రుణాలు తీసుకుంటున్న తీరు పై తాను ప్రధాని.. కేంద్ర ఆర్దిక మంత్రికి లేఖలు రాయటంతో సీఎంను ఢిల్లీకి పిలిపించారని చెప్పుకొచ్చారు. కార్పొరేషన్ల ద్వారా ఇష్టసారంగా అప్పులు చేస్తున్నందుకు జగన్‌ను మోదీ మందలించారని చెప్పారు.

చంద్రబాబు - పవన్ ను దగ్గర చేస్తున్నారు

చంద్రబాబు - పవన్ ను దగ్గర చేస్తున్నారు


సీఎం జగన్ పదే పదే ప్రతిపక్ష నేతలను తిట్టి వారిద్దరినీ దగ్గర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తో గొడవ ఎందుకు ప్రశ్నించారు.కరెంటు ఇవ్వలేక పరిశ్రమలకు పవర్‌ హాలిడేస్‌ ఇచ్చిందని ఆక్షేపించారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని రఘురామ డిమాండ్‌ చేశారు. సీఎం జగన్ తన సొంత పత్రిక చదవటం మానేసి.. ప్రజల్లో తిరిగినా..ఇంటలిజెన్స్ నుంచి వాస్తవాలు తెలుసుకున్నా.. సామాజిక మాధ్యమాల్లో తిడుతున్న తిట్లు చూసుకున్నా సీఎం జగన్ గుండె ఆగిపోతుందంటూ రఘురామ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

ఆ మంత్రులను తప్పిస్తే సంక్షోభమే

ఆ మంత్రులను తప్పిస్తే సంక్షోభమే


కేబినెట్ లో పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని తో రాజీనామా చేయించినా..తిరిగి వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని రఘురామ చెప్పుకొచ్చారు. సీఎం జగన్ వారిని తొలిగించే ధైర్యం చేస్తే పార్టీలో సంక్షోభం వస్తుందని వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం అంటూనే తిరుపతిలో అన్ని పదవులు ఒకే వర్గానికి కట్టబెట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉంటూ వ్యాపారాలు చేయకూడదని.. మారు పేర్లతో వ్యాపారాలు చేయటం లేదా అంటూ ప్రశ్నించారు.

English summary
YCP Rebel MP Rahgu Rama Raju sensational comments against CM Jagan on his delhi tour and power cuts in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X