'హత్యలకు చంద్రబాబే కారణం': 'ఏం చెప్తే ఉమ దానికి తలూపుతారు'
చిత్తూరు: గోదావరి పుష్కరాలలో తొలి రోజున 27 మందిని బలిగొన్న తొక్కిసలాటకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడే కారణమని పిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి మండిపడ్డారు. ముందస్తు జాగ్రత్తలు లేకుండా పుష్కరాలు ప్రారంభించారని ఆరోపించారు.
తన అర్భాటం కోసమే రూ.1500 కోట్లు గోదావరిలో పోశారని మండిపడ్డారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టింది ప్రజల ప్రాణాలు తీసేందుకా అన్నారు. ఇది దోపిడీ ప్రభుత్వమని, హోల్ సేల్‌ల కోసం జన్మభూమి కమిటీలు వేసిందన్నారు. ప్రజల కోసం పోరాటం చేస్తామన్నారు.
చంద్రబాబుపై దేవినేని నెహ్రూ ఆగ్రహం

గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు ట్రాఫిక్ ఎస్సైలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ మండిపడ్డారు. పుష్కరాల్లో చంద్రబాబు అసమర్థత వల్ల రాష్ట్రం పరువు పోయిందన్నారు. రాయలసీమ ప్రజలు కరువుతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు రాజమండ్రికే పరిమితమయ్యారన్నారు.
రాష్ట్రంలో పరిపాలన ఉందా లేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు పెద్ద ఇంజనీర్ అయితే, మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు చిన్న ఇంజనీర్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏది చెబితే దానికి ఉమ తల ఊపుతుంటారన్నారు.












Click it and Unblock the Notifications