కాంగ్రెస్ పోరుబాట .. అమరావతి రైతులకు మద్దతుగా రంగంలోకి రాహుల్ గాంధీ ?
ఏపీలో అధికార పార్టీని టార్గెట్ చేసి బీజేపీ, జనసేన , టీడీపీలు వైసీపీపై మాటల దాడిని కొనసాగిస్తుంటే, కొత్తగా కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. రాజధాని అమరావతి రైతుల కోసం పోరుబాట పట్టాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అమరావతి జేఏసీ నేతలతో మాట్లాడుతున్నారు. ఇక ఏపీలో కాంగ్రెస్ ప్రజా క్షేత్రంలోకి వెళ్ళాలని భావిస్తున్న తరుణంలో అమరావతి ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలలో తమ వంతు పాత్ర పోషించాలని చూస్తుంది కాంగ్రెస్.
Recommended Video


ఏపీలో రాజధాని రైతులకు బాసటగా కాంగ్రెస్
వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలు రాజధానిగా అమరావతికే మద్దతు పలుకుతున్న నేపధ్యంలో జాతీయ స్థాయి నాయకుల్ని పిలిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్‌కు కొత్తగా నియమితులైన కార్యవర్గం కొత్త పీసీసీ చీఫ్ శైలజానాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీ రెడ్డి అమరావతికి మద్దతుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు . ఇక అమరావతి పోరాటానికి ప్రాధాన్యత రావాలంటే రాహుల్ గాంధీని అమరావతికి తీసుకు రావాలని నిర్ణయం తీసుకున్నారు.

రాహుల గాంధీని ఏపీ రాజధానికి తీసుకురావాలని ప్లాన్
ఏపీ కాంగ్రెస్ నేతల ప్రతిపాదనకు రాహుల్ గాంధీ కూడా మద్దతు తెలిపారని సమాచారం . తాను వస్తానని రాహుల్ ఏపీ కాంగ్రెస్ నేతలకు చెప్పినట్టు తెలుస్తుంది . రాహుల్ గాంధీ పర్యటనతో అమరావతి పోరాటం జాతీయ స్థాయికి చేరుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక ఆయన పర్యటనను వీలైనంత త్వరగా ఫైనల్ చెయ్యాలని భావిస్తున్నారు. అయితే మార్చి ఒకటో తేదీ నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

ఢిల్లీ వెళ్లి రాహుల్ ను ఆహ్వానించనున్న జేఏసీ నేతలు
ఇక ఈ సమావేశాల నేపధ్యంలో ఆ సమావేశాల మధ్యలో రాహుల్ రావడం కుదరదన్న భావనలో ఏపీ కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. ఆ సమావేశాలు ముగిసిన తర్వాత మొదటి వారంలోనే పర్యటన ఖరారు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇక మరోమారు ఢిల్లీ వెళ్లనున్న జేఏసీ నేతలు రాహుల్ గాంధీని కలిసి ఆయనను అమరావతికి మద్దతు కోరుతూ పర్యటించాలని కోరే అవకాశం ఉంది. ఏది ఏమైనా రాహుల్ గాంధీ అమరావతి రైతుల కోసం వస్తే ఇష్యూ జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావటం ఖాయం . అలా జరిగినా సీఎం జగన్ నిర్ణయంలో మాత్రం ఏ మాత్రం మార్పు ఉండదు అనేది రాజకీయ వర్గాల అభిప్రాయం .
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
తెలంగాణాలో వైద్య సేవలు టాప్.. లెక్కలు చెప్పిన మంత్రి! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications