Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ కల్లు దుకాణం.. జగన్, బాబు అన్నదమ్ములు..! జగ్గారెడ్డి సెటైర్లు..!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ ప్రజలంతా బీజేపీ పార్టీ ఓట్ల చోరీ విషయంలో ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని, రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలపై ఎంక్వైరీ చేయడం లేదని ఆయన ఆరోపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండకూడదు అనేది బిజెపి కుట్ర అన్నారు.

విజయవాడలోని ఆంధ్రరత్నభవన్ లో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడిన జగ్గారెడ్డి.. రాహుల్ గాంధీకి ప్రధాని పదవి కొత్త కాదని, ఆ ప్రధాని పోస్టు పుట్టిందే వాళ్లింట్లో అన్నారు. ఈసీ ని రాహుల్ గాంధీ ప్రశ్నించారని, ఆయన కుటుంబం మీద బీజేపీ కక్ష సాధిస్తోందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్ధల ద్వారా దొంగ ఓట్లు తయారు చేశారని, ఎలక్షన్ కమీషన్ కూడా ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ రీడర్ అని చెప్పక తప్పడం లేదని జగ్గారెడ్డి విమర్శించారు. పాకిస్తాన్ లాంటి విధానాలు అమలు చేయాలనే కుట్ర బిజెపి చేస్తోందన్నారు.

Rahul s Vote Chori Battle Jagga Reddy Takes Aim at Jagan Naidu for Staying Awa

ఏపీకి బిజెపి తండ్రి, జగన్ చంద్రబాబు కొడుకులని జగ్గారెడ్డి విమర్శించారు. ఏపీ పాలిటిక్స్ కల్లుదుకాణం దగ్గర కూచునే అన్నదమ్ముల్లా ఉంటుందని, బీజేపీ ఆ కల్లు దుకాణమని, అన్నదమ్ములు చంద్రబాబు, జగన్ అని సెటైర్లు వేశారు. రాష్ట్ర విభజనకు లెటర్లు ఇచ్చింది చంద్రబాబు, జగన్ అన్నారు. తమ కాంగ్రెస్ లో అందరూ దమ్మున్నోళ్ళమే అన్నారు. కోమటిరెడ్డి సోదరులు దమ్మున్న వాళ్ళేనన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ బానిసలు అన్నారు.

బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని, దేశ ప్రజల స్వేచ్ఛను అణగదొక్కే కుట్ర చేస్తున్నాయని జగ్గారెడ్డి విమర్శించారు. ప్రతీ ఒక్కరికీ ఓటు ద్వారా స్వతంత్రం, స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిందని, ఎవ్వరూ ఊహించని విధంగా మూడోసారి మోదీ ప్రధాని అయ్యాక పలు అనుమానాలు వచ్చాయన్నారు. మోదీ ప్రధాని అవడానికి కారణమైన నలభైకి పైగా ఎంపీల ఓట్లు బోగస్ అని అనుమానం అన్నారు. అది నిజమా అబద్ధమా చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల కమీషన్ దే అన్నారు.

భద్రతగా భావించే ఎలక్షన్ కమీషన్ తప్పు దారి పట్టిందని,మారు మూల గ్రామాలలో, కనిపించని ప్రాంతాలలో దొంగ ఓట్లను నమోదు చేయించి గెలుపుకు ప్రణాళిక చేసారని జగ్గారెడ్డి ఆరోపించారు. దొంగ ఓట్ల‌ ద్వారా అధికారం లోకి వచ్చారని, ముఫ్ఫై, నలభై ఏళ్ళ నుంచీ ఇది జరుగుతోందని అనుమానమన్నారు. వ్యూహాత్మకంగా బిజెపి చేస్తున్న ప్రయత్నం అన్నారు. దేశ ప్రజల స్వేచ్ఛను అణగదొక్కే కుట్ర బిజెపి, ఆర్ఎస్ఎస్ చేస్తున్నాయన్నారు. దొంగ ఓట్లను తయారుచేసే నైపుణ్యం కలిగినవి బిజెపి, ఆర్ఎస్ఎస్ అన్నారు. దేశం మొత్తం ఈ దొంగ ఓట్ల ప్రక్రియ జరిగిందని తెలిపారు.

Rahul s Vote Chori Battle Jagga Reddy Takes Aim at Jagan Naidu for Staying Awa

కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో మాజీ సీఎం అని, ఇప్పుడు బీజేపీ స్క్రిప్ట్ చదవాలి కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి అదే చేసాడని జగ్గారెడ్డి ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి లీడరా, ఎన్నికల కమీషనరా అర్ధం కాలేదన్నారు. బిజెపి ప్రముఖ్ ఇచ్చిన చిట్టీ తీసుకుని చదివాడన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఒక స్క్రిప్టు రీడర్ అని విమర్శించారు. పురంధేశ్వరి ఎన్టీఆర్ కూతురైనా బిజెపి స్క్రిప్టు చదవాల్సిందేనన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+