Jio నుంచి అదిరిపోయే అప్‌డేట్, ఇక మారుమూల పల్లెల్లోనూ..

దేశీయ టెలికాం రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ దూసుకుపోతున్న రిలయన్స్ జియో, మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. జియో 5G నెట్‌వర్క్ వినియోగదారుల సంఖ్య ఏకంగా 26.8 కోట్లు (268 మిలియన్లు) దాటినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో కంపెనీ ఛైర్మన్ ఆకాష్ అంబానీ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. చైనా వెలుపల ఒకే ఒక్క టెలికాం కంపెనీ ద్వారా నడపబడుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్‌వర్క్‌గా జియో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. గడిచిన ఏడాది కాలంలోనే కంపెనీ కొత్తగా 7.7 కోట్ల మంది 5G కస్టమర్లను తన ఖాతాలో వేసుకుందని, రాబోయే 2030 నాటికి జియో యూజర్లు అందరినీ పూర్తిగా 5G నెట్‌వర్క్‌కు మార్చడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ప్రతి ఇంటికీ 'జియో ఎయిర్‌ఫైబర్'..

వైర్లెస్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో 'జియో ఎయిర్‌ఫైబర్' (Jio AirFiber) సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1.3 కోట్ల ఇళ్లకు ఎయిర్‌ఫైబర్ కనెక్షన్లు అందించామని, ప్రతిరోజూ కొత్తగా దాదాపు 60,000 ఇళ్లు ఈ నెట్‌వర్క్‌లో చేరుతున్నాయని ఆకాష్ అంబానీ వెల్లడించారు. "భారతదేశంలోని ప్రతి మూలకు, ప్రతి ఇంటికీ జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా హై-స్పీడ్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను తీసుకెళ్లడమే మా తదుపరి ప్రధాన లక్ష్యం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వినియోగదారులకు స్మార్ట్, పర్సనలైజ్డ్ అనుభూతిని అందించడానికి జియో సాంకేతికతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని వేగంగా జోడిస్తున్నామని, దేశీయ సవాళ్లను పరిష్కరించడానికి తాము అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీని భవిష్యత్తులో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు.

Akash Ambani Unveils Jio Satellite Broadband Ecosystem After 5G Network Crosses 268 Million Users
రూ. 33,000 కోట్ల రిలయన్స్ జియో ఐపీఓ: ఇన్వెస్టర్లకు పండగే
రూ. 33,000 కోట్ల రిలయన్స్ జియో ఐపీఓ: ఇన్వెస్టర్లకు పండగే

'నేలపై కనెక్ట్ చేశాం.. ఇక ఆకాశం నుంచే నెట్‌వర్క్'!

ఈ ఏజీఎమ్ సమావేశంలో అందరినీ ఆకర్షించిన అతిపెద్ద ప్రకటన శాటిలైట్ కమ్యూనికేషన్స్ (ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్). భారతదేశం కోసం ప్రత్యేకంగా ఒక సార్వభౌమ లో ఎర్త్ ఆర్బిట్ (LEO) శాటిలైట్ కాన్‌స్టలేషన్‌ను (ఉపగ్రహాల సమూహం) అభివృద్ధి చేసే దిశగా జియో వేగంగా అడుగులు వేస్తోందని ఆకాష్ అంబానీ ప్రకటించారు. ఈ సేవలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ శాటిలైట్ ఆపరేటర్ల నుంచి కెపాసిటీని లీజుకు తీసుకుంటున్నామని చెప్పారు. "జియో ఇప్పటివరకు భారతదేశాన్ని నేలపై కనెక్ట్ చేసింది.. ఇకపై భారతదేశాన్ని ఆకాశం నుంచి కనెక్ట్ చేయబోతున్నాం" అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Ambani on Gold: అంబానీ చెప్పిన పెట్టుబడి ప్లాన్, ఇలా చేస్తేనే లాభం!
Ambani on Gold: అంబానీ చెప్పిన పెట్టుబడి ప్లాన్, ఇలా చేస్తేనే లాభం!

ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా దేశంలోని మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలు, ద్వీపాలు, సరిహద్దు ప్రాంతాలకు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం భారతదేశంలోనే సొంతంగా 'గ్రౌండ్ స్టేషన్' మౌలిక సదుపాయాలను జియో నిర్మిస్తోంది. దీని ద్వారా పూర్తి స్థాయి ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ వ్యవస్థ ఏర్పడటమే కాకుండా, అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్ రంగంలో భారతదేశం స్వయంసమృద్ధి (ఆత్మనిర్భరత) సాధించడానికి బలమైన పునాది పడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+