హైదరాబాద్ To ఊటీ ట్రిప్.. బడ్జెట్ లోనే క్రేజీ ప్యాకేజీ..!

మండుటెండలు అయినా చిరు జల్లులు అయినా.. వాతావరణం ఎలా ఉన్నా పచ్చని ప్రకృతి మధ్య కాసేపు గడిపినా చాలు.. మనసుకు ఎంతో హాయిని అందిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే చాలా మంది మాత్రం రీఫ్రెష్ మెంట్ కోసం ఊటీకే వెళ్తారు. ఊటీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని అందుకే పిలుస్తారు. ఇక్కడికి వెళ్తే తిరిగి రావాలనిపించదు. అంత అద్భుతంగా ప్రకృతి ఉంటుంది. అయితే పచ్చని ప్రకృతి మధ్య ఫ్యామిలీ మెంబర్స్​తో హ్యాపీగా గడపాలనుకుంటున్నారా..?

అయితే మీకోసం ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఊటీలో విహరించే అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది ఐఆర్​సీటీసీ. టూర్ లో భాగంగా ప్రతి మంగళవారం సికింద్రాబాద్ నుంచి ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది. 5 రాత్రులు, 6 రోజుల పాటు ఈ ట్రిప్ సాగుతుంది. ఈ ట్రిప్‌ లో ఊటీ అందాలను, కూనూర్ లోయలను పర్యటకులు మనసారా ఆస్వాదించే అవకాశం ఉంది.

పర్యాటకులు.. ఈ టూర్ కోసం సికింద్రాబాద్, నల్గొండ, గుంటూరు, తెనాలి రైల్వేస్టేషన్లలో ఈ ట్రైన్ ఎక్కొచ్చు. టూర్ ముగిశాక మళ్లీ ఆయా రైల్వే స్టేషన్లలో దిగొచ్చు. అయితే ఇప్పుడు పర్యాటకుల కోసం మరో క్రేజీ ఆఫర్ అందిస్తోంది ఐఆర్​సీటీసీ. జూలై 30 నుంచి సెప్టెంబర్ 22 మధ్య ప్రయాణించే వారికి రైలు టికెట్లు, కోయంబత్తూర్ నుంచి ఊటీకి షేరింగ్ బేసిస్‌ పై ఏసీ వెహికల్ ట్రాన్స్‌ పోర్ట్ సదుపాయం అలాగే ఊటీలో 3 రాత్రులు నాన్ ఏసీ హోటల్ స్టే, 3 రోజులు మార్నింగ్ బ్రేక్‌ ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్, పార్కింగ్, జీఎస్టీ అన్నీ ఇందులోనే కలిపి అందిస్తోంది ఐఆర్​సీటీసీ.

IRCTC Budget Package for Hyderabad to Ooty Trip Full Details and Itinerary Here IRCTC Ooty package

ఈ ప్రయాణంలో భాగంగా యాత్రికులు ఊటీలోని బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్, దొడబెట్ట పీక్‌, టీ మ్యూజియం, పైకారా వాటర్ ఫాల్స్ ను సందర్శించొచ్చు. అలాగే కూనూర్‌, రోజ్ గార్డెన్, నీలగిరి మౌంటెన్ రైల్వే తదితర ప్రదేశాలను కవర్ చేయవచ్చు. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే సింగిల్ షేరింగ్ రూ. 28,730 చొప్పున ఉంటుంది. అలాగే ఇద్దరు కలిసి రూమ్ పంచుకుంటే ఒక్కొక్కరికి రూ. 16,460 చొప్పున పడుతుంది. ఇక ముగ్గురు కలిసి ఉంటే ఒక్కొక్కరికి రూ. 15,550 గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఊటీ టూర్ ట్రై చేయండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+