కలిసి నడుద్దాం..! స్టాలిన్ కు రాహుల్ ట్వీట్..!

తమిళనాడులో తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దశాబ్దాలుగా మిత్రపక్షాలుగా ఉన్న డీఎంకే-కాంగ్రెస్ మధ్య చిచ్చుపెట్టాయి. ముఖ్యంగా ఎన్నికల్లో డీఎంకే కూటమిలో పోటీ చేసి గెలిచి, ఫలితాల అనంతరం విజయ్ కు మద్దతునివ్వాలన్న కాంగ్రెస్ నిర్ణయం మాజీ సీఎం ఎంకే స్టాలిన్ కు ఏమాత్రం నచ్చలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ తీరుపై నిర్మొహమాటంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీంతో డీఎంకే నాయకులు, శ్రేణులు సైతం కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇవాళ ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.

స్టాలిన్ బిగ్ యూటర్న్..! విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేద్దాం..!
స్టాలిన్ బిగ్ యూటర్న్..! విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేద్దాం..!

ఇవాళ లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (rahul gandhi) పుట్టినరోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నేతలతో పాటు ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు, కొత్త మిత్రుడు విజయ్ కూడా రాహుల్ కు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇదే క్రమంలో రాహుల్ మాజీ మిత్రుడు, సోదరుడిగా పలుమార్లు చెప్పుకున్న తమిళనాడు మాజీ ముఖ్యంమత్రి, డీఎంకే అధినేత కూడా అయిన ఎంకే స్టాలిన్ (MK Stalin) కూడా శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. రాహుల్ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

Rahul Gandhi to Stalin Fight for India s Soul We Will Wage It Together
Rahul Gandhi: టెలిగ్రామ్ తర్వాత వాట్సాప్ బ్యాన్ ? రాహుల్ షాకింగ్ హింట్..!
Rahul Gandhi: టెలిగ్రామ్ తర్వాత వాట్సాప్ బ్యాన్ ? రాహుల్ షాకింగ్ హింట్..!

దీనికి రాహుల్ గాంధీ కూడా స్పందించారు. మీ ఆప్యాయమైన శుభాకాంక్షలకు ధన్యవాదాలు, తిరు ఎం.కె. స్టాలిన్ గారూ అంటూ ట్వీట్ చేశారు. 'భారతదేశం' అనే భావనను, మన రాజ్యాంగాన్ని మరియు సమాఖ్య వ్యవస్థను పరిరక్షించాలనే మన ఉమ్మడి సంకల్పం మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది; ఇది మన ప్రజాస్వామ్య ఆత్మను కాపాడుకునే పోరాటం, విజయం సాధించే వరకు మనం దీనిని కలిసి సాగిస్తాం అంటూ స్టాలిన్ కు రాహుల్ సూచించారు. మామూలుగా అయితే స్టాలిన్ ట్వీట్, రాహుల్ స్పందనకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లుపై ఎదురైన ఓటమితో ప్రధాని మోడీ దేశంలో టీఎంసీ, శివసేన, ఎస్పీ వంటి పార్టీల్ని చీల్చే క్రమంలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న డీఎంకేని కూడా చీల్చేలా కనిపిస్తున్నారు. దీంతో రాహుల్ అలర్ట్ అయి స్టాలిన్ ను కలుపుకుపోయేలా ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+