హైదరాబాద్ కు కేంద్రం గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ థ్యాంక్స్..

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. బాపూ ఘాట్‌ వద్ద గాంధీ సరోవర్‌ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు 83 ఎకరాల రక్షణ శాఖ భూముల్లో మూసీ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసింది. అలాగే గోల్కొండ ఆర్టిలరీ పరిధిలోని రూ.533 కోట్ల విలువైన భూముల బదలాయింపునకు కూడా అనుమతి ఇచ్చింది.

అయితే అందుకు బదులుగా మరోచోట రూ.533 కోట్ల విలువైన భూములు ఇవ్వాలని ప్రభుత్వానికి షరతు పెట్టింది. అయితే కేంద్రం నిర్ణయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రక్షణమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్, కేంద్ర రక్షణ శాఖ, ఇండియన్‌ ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపారు. మూసీ నది పునరుజ్జీవనం, రివర్‌ ఫ్రంట్ అభివృద్ధి విజన్‌ లో ఇదో కీలక మైలురాయి అని పేర్కొన్నారు. అలాగే మూసీ పరివాహక ప్రాంతాన్ని పర్యావరణ సాంస్కృతిక, ప్రజా ఆస్తిగా మార్చడమే లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం అనుమతితో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కీలక అడుగు పడింది. ఇక మూసీ నది పునరుజ్జీవనం, గాంధీ సరోవరం ప్రాజెక్టు పనులను తెలంగాణ ప్రభుత్వం ముమ్మరం చేసింది. హైదరాబాద్ నగర జీవనాడి అయిన మూసి నదిని అత్యంత అద్భుతంగా తీర్చి దిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం పనులను వేగవంతం చేస్తోంది. దశాబ్ద కాలం నుంచి మురుగు నీరు, వ్యర్థాలతో నిండిపోయిన మూసీ నదిని ఒక ప్రపంచ స్థాయి పర్యాటక, ఆర్థిక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది.

Gandhi Sarovar Project at Bapu GhatGets GreenLight from Union Defence Ministry GandhiSarovarproject

మరోవైపు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే ప్రతిష్టాత్మకమైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+