వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం: మృతులు వీరే

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నాందేడ్ - బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మరణించినవారిని గుర్తించే కార్యక్రమం ప్రారంభమైంది. ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతపురం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 26 మంది మరణించారు. మృతుల్లో కొందరిని గుర్తించారు.

మంటల్లో మృతదేహాలు గుర్తు పట్టరానంతగా కాలిపోయాయి. కర్నూలు జిల్లాలోని ఆదోనీ టీచర్స్ కాలనీకి చెందిన రిటైర్డ్ టీచర్ బసవరాజు, ఆయన కూతురు సర్వమంగళం ప్రమాదంలో మరణించారు. సర్వమంగళం కౌతాళంలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ప్రమాదం నుంచి బసవరాజు భార్య అన్నపూర్ణమ్మ, అల్లుడు చరణ్ బయటపడినట్లు తెలుస్తోంది.

Rail accident

బసవరాజు, అన్నపూర్ణమ్మ తమ కుమారిడికి బెంగళూర్ వెళ్లి పెళ్లి సంబంధం చూసి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. అనంతపురం, ధర్మవరం ఆస్పత్రుల్లో చెన్నైకి చెందిన విజిత, తనుశ్రీ, నటేష్, మైసూరుకు చెదిన విజయ, బెంగుళూర్‌కు చెందిన తనూజ చికిత్స పొందుతున్నారు. మృతుల్లో బెంగుళూర్‌రు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

మృతులు వీరే

బసవరాజు (కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్)
సర్వమంగళం (కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్)
అనిల్ కుమార్ (ముంబై)
మధు (బెంగళూర్)
రాంప్రసాద్ (బెంగళూర్)
అనిల్ కులకర్ణి, లలిత, పద్మజ (బెంగళూర్)
గణేష్ (హైదరాబాద్)

English summary
Few passengers dead in Nanded - Bangalore express treain accident have been identified.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X