గంగా పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్ రైళ్లు..!!
గంగా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మే 5వ తేదీ వరకు గంగా పుష్కరాలు జరగనున్నాయి. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లనున్నారు. వీరి కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మూడు ప్రాంతాల నుంచి ఈ రైళ్లు బయల్దేరనున్నాయి. వీటికి సంబంధించిన రూట్..సమయం గరించి రైల్వే శాఖ వివరాలు వెల్లడించింది.
గంగా పుష్కరాలకు ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. గంగా పుష్కరాలు గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బద్రీనాథ్, కేదార్ నాథ్, వారణాసి (కాశీ), ఋషీకేశ్, అలహాబాద్ (సంగం ప్రయాగ)లలో జరుగుతాయి. కాశీనాథుడు కొలువుదీరిన పవిత్ర వారణాసి క్షేత్రంలో గంగా పుష్కర స్నానానికి 64 స్నాన ఘాట్‌లు ఉన్నాయి.
అన్నింటిలో మణికర్ణికా ఘాట్ ముఖ్యమైనది. ఈ పుష్కరాల్లో పాల్గొనే భక్తుల కోసం సికింద్రాబాద్, తిరుపతి, గుంటూరు నుంచి వేర్వేరుగా మూడు ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్, ప్రయాగ్‌రాజ్, వారణాసి మీదుగా రక్సోల్ వరకు ఒక రైలు ఏర్పాటు చేసింది.

తిరుపతి, ప్రయాగ్ రాజ్, వారణాసి మీదుగా దానాపూర్ వరకు మరో ప్రత్యేక రైలు, గుంటూరు, ప్రయాగ్ రాజ్ మీదుగా బెనారస్ వరకు ఇంకో రైలు అందుబాటులోకి తీసుకొచ్చారు. గంగా పుష్కరాలు ప్రారంభమైన నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి రక్సోల్ వరకు నడిచే ప్రత్యేక రైలును ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.
ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్-వారణాసి మీదుగా రక్సోల్ చేరుకుంటుంది. ఏప్రిల్ 23, ఏప్రిల్ 30, మే 7 తేదీలలో సికింద్రాబాద్ నుంచి రక్సోల్‌కి ప్రతి ఆదివారం రాత్రి 10: 30 నిముషాలకు ప్రారంభమవుతుంది.సికింద్రాబాద్ నుంచి రక్సోల్ వరకు నడిచే ప్రత్యేక రైలు మాదిరిగానే తిరుపతి నుంచి దానాపూర్‌కి కూడా మరో స్పెషల్ ట్రైన్ ప్రారంభం కానుంది.

తిరుపతి నుంచి దానాపూర్ ఈ ట్రైన్ తిరుపతి నుంచి ప్రయాగ్ రాజ్-వారణాసి మీదుగా దానాపూర్ చేరుతుంది. ఇక ఈ ట్రైన్ ఏప్రిల్ 22 & 29 అలాగే,మే 7వ తేదీలలో తిరుపతి నుంచి ప్రారంభమవుతుంది. అదే విధంగా..గంగా పుష్కరాలకు వెళ్లే వారి కోసం గుంటూరు నుంచి కూడా ప్రత్యేక రైలు ఉంది. ఈ ట్రైన్ గుంటూరు నుంచి ప్రయాగ్ రాజ్ మీదుగా బెనారస్ వరకు వెళ్తుంది.
ఏప్రిల్ 22 & 29 అలాగే, 06 మే తేదీలలో ఇది నడుస్తుంది. ఈనెల 29న వారణాసిలోని గంగా ఘాట్ దగ్గర జరిగే తెలుగు సంగమంలో ప్రధాని మోదీ పాల్గోనున్నారు. పవిత్ర గంగా పుష్కరాలు మరికొద్ది గంటల్లో ప్రారంభంకానున్నాయి. శనివారం నుంచి మే 3వరకు పన్నెండు రోజులపాటు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications