రైల్వేబడ్జెట్: టీడీపీ అసహనం, తెలుగు రాష్ట్రాలకు ఇంతే..! ఎవరేమన్నారు..
హైదరాబాద్: కేంద్రమంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ పైన విమర్శలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తవి అనకుండా దూరదృష్టితో మంచి బడ్జెట్ ప్రవేశ పెట్టారని కొందరు పొగడుతుండగా, కొత్త ప్రాజెక్టులు, రైళ్లు లేవని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
ముఖ్యంగా బడ్జెట్‌లో దూరదృష్టి, భద్రత, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. కొత్త వాటి కంటే పాత ప్రాజెక్టులను పూర్తి చేయడం, ప్రయాణీకులను సంతుష్టులను చేయడానికే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పించారు. మహిళల భద్రత పైన ఈ బడ్జెట్‌లో ప్రత్యేక దృష్టి సారించారు. వైఫై సౌకర్యాలు, కొత్త హెల్ప్ లైన్లు, స్పీడ్ రైళ్లు రానున్నాయి. ప్రయాణీకుల ఛార్జీలు పెంచనప్పటికీ, సరకు రవాణా ఛార్జీలు పెరిగే అవకాశముంది.

కాంగ్రెస్ పార్టీ, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, కాంగ్రెస్ నేత శశిథరూర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాంగ్రెస్ నేతలు, వైయస్సార్ కాంగ్రెస్ నేతలు రైల్వే బడ్జెట్ పైన పెదవి విరిచారు.
బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, శివసేనలు కూడా పెదవి విరిచాయి. ఏపీకి కేటాయింపులు లేవని టీడీపీ, బడ్జెట్లో స్పష్టత లేదని, అమలుకు నిధులు ఎలా వస్తాయో అర్థం కావడం లేదని శివసేన చెబుతోంది. రైల్వే బడ్జెట్ నిరాశ పరిచిందని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. విభజన హామీలు కూడా నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాలకు...

కాజీపేట - విజయవాడ మధ్య మూడో రైల్వే లైనుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రూట్ చాలా రద్దీగా ఉంటుంది. దీంతో లెవల్ క్రాసింగుల వద్ద రైళ్లను ఆపుతుండటంతో ప్రయాణం ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు పదేళ్ల క్రితమే మూడో లైన్ ప్రకటించారు. సర్వే పూర్తయింది.
ఈ లైనుకు రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చు కావొచ్చని అంచనా. గతంలో కొన్ని నిధులు విడుదల చేశారు. ఇప్పుడు సురేష్ ప్రభు ప్రకటనతో మరిన్ని నిధులు విడుదలయ్యే అవకాశముంది. దీంతో ఇది త్వరితగతిన పూర్తవుతుందని ఆశిస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వేకు రూ.2,768 కోట్లు
దక్షిణ మధ్య రైల్వేలో మౌలిక సదుపాయుల కల్పనకు రూ.2,768 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే ఇది దాదాపు పావు శాతం ఎక్కువ. దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన వివరాలను జీఎం శ్రీవాత్సవ మీడియా ముందు వెల్లడించారు.

36 కొత్త రైల్వే బ్రిడ్జిలు, వీటి కోసం రూ.1,587 కోట్లు, ప్యాసింజర్ సదుపాయాల కోసం రూ.29 కోట్లు, ట్రాఫిక్ వసతుల కోసం రూ.68 కోట్లు, ఆర్వోబీ, ఆర్‌యూబీలకు రూ.1587 కోట్లు, మనోహరాబాద్ - కొత్తపల్లి లైనుకు రూ.20 కోట్లు, పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ లైనుకు రూ.141 కోట్లు, మేళ్ల చెరువు-విష్ణుపురం లైన్‌కు రూ.100 కోట్లు, నంద్యాల-ఎర్రగుంట్ల లైనుకు రూ.130 కోట్లు, నడికుడి-శ్రీకాళహస్తి లైనుకు రూ.110 కోట్లు, విజయవాడ-భీమవరం-నిడదవోలు లైన్ డబ్లింగ్ విద్యుధీకరణకు రూ.150 కోట్లు, సికింద్రాబాద్-మహబూబ్ నగర్ లైన్ డబ్లింగ్ పనులకు రూ.1,200 కోట్లు కేటాయించారు.
దువ్వాడ-విజయవాడ లైన్‌కు రూ.3.34 కోట్లు, బాపట్ల - నిజాంపట్నం-రేపల్లె లైన్‌కు రూ.15 లక్షలు, గిద్దలూరు-బాకరాపేట లైన్‌కు రూ.19 లక్షలు, మంత్రాలయం రోడ్డు - కర్నూలు టౌన్ లైన్‌కు రూ.13 లక్షలు, గుత్తి - ధర్మవరం లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ రూ.26 లక్షలు, గుంతకల్లు - గుంటూరు డబ్లింగ్ పనులకు రూ.80 లక్షలు, బీడీఆర్సీ-విశాఖ లైన్‌కు రూ.41 కోట్లు, జగ్గయ్యపేట-మిరియాలగూడ లైన్‌కు దాదాపు రూ.పది లక్షలు, నంద్యాల - ఆత్మకూరు లైన్‌కు రూ.నాలుగున్నర లక్షలు, హైదరాబాద్-శ్రీశైలం లైన్‌కు రూ.పాతిక లక్షలు, మహబూబ్ నగర్ - గుత్తి లైన్‌కు రూ.63న్నర లక్షలు, ధర్మవరం- పాకాల లైన్‌కు రూ.60 లక్షలకు పైగా. తిరుపతి-కాట్పడి లైన్ సర్వే కోసం రూ.14 లక్షలకు పైగా.
ఎవరేమన్నారు?
రైల్వే బడ్జెట్ మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా ఉంది. బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడం ఇదే తొలిసారి. గతంలో తమ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులపై స్పష్టత ఇవ్వలేదు. - కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
దేశ చరిత్రలో ఇలాంటి బడ్జెట్‌ను ఇది. ప్రజలను బీజేపీ మోస్తం చేస్తోందనడానికి ఈ బడ్జెటే నిదర్శనం. - బొత్స సత్యనారాయణ
బడ్జెట్ అసంతృప్తిగా ఉంది. విభజన సమయంలో ఇచ్చిన హామీలు లేవు. కేఈ కృష్ణమూర్తి.
బడ్జెట్‌లో ఏపీకి ఎలాంటి కేటాయింపులు లేవు - మైసూరా రెడ్డి
సామాన్యుడి బడ్జెట్ - బండారు దత్తాత్రేయ
తెలంగాణకు అన్యాయం జరిగింది. కేసీఆర్ రైల్వే ప్రాజెక్టులు తేవడంలో విఫలం - పొన్నం ప్రభాకర్
తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్‌లో అన్యాయం - సీపీఐ నారాయణ
వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించారు. రెండు దశాబ్దాలలో ఇది ఉత్తమ బడ్జెట్ - లోక్‌సత్తా జేపీ
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications