సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు మూడు గంటల జర్నీలో తొలి అడుగు

ప్రధానమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేంతవరకు, ఆ తర్వాత కూడా నరేంద్రమోడీ రైల్వే అభివృద్దికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే మార్గాల ఆధునికీకరణతోపాటు సింగిల్ లైన్ మార్గాలను డబుల్ లైన్ గా, డబుల్ లైన్ మార్గాలను త్రిబుల్ లైన్ గా మారుస్తున్నారు. ప్రధాన నగరాల్లో ఉన్న అన్ని రైల్వేస్టేషన్లను విమానాశ్రయాల తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ప్రయాణం చేసేటప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఉండాలనే ఉద్దేశంతోపాటు ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో అందుకునేలా సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ రైళ్లను కూడా ప్రవేశపెట్టారు.

పెరుగుతున్న రైళ్ల రద్దీ
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంటూరు-సికింద్రాబాద్ మార్గం అత్యం కీలకంగా మారింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, చెన్ై వరకు ఉన్న రైల్వే లైన్లకు ఇది ప్రత్యామ్నాయంగా ఉంటోంది. రోజురోజుకు రైళ్ల రద్దీ తీవ్రంగా పెరుగుతోంది. దీంతో ఇప్పటివరకు సింగిల్ లైన్ గా ఉన్న గుంటూరు-బీబీనగర్ మార్గాన్ని డబుల్ లైన్ కు విస్తరిస్తున్నారు. దీనివల్ల సికింద్రాబాద్ నుంచి గుంటూరు, విజయవాడకు ప్రయాణ సమయం తగ్గుతోంది. గుంటూరుకు మూడు గంటల్లో, విజయవాడకు మూడున్నర గంటల్లో సికింద్రాబాద్ నుంచి చేరుకోవచ్చు.

Railway department has given notification for acquisition of 48 acres of land in guntur district

48 ఎకరాలకు నోటిఫికేషన్
డబుల్ లైన్ పనులు చేపట్టేందుకు గుంటూరు జిల్లాల్లో భూములు అవసరం కావడంతో రైల్వే శాఖ భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే రైల్వే దగ్గర భూములు ఉన్నప్పటికీ మరికొన్ని అవసరం కావడంతో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాడికొండ మండలం బండారుపల్లిలో 9.099 ఎకరాలు, గుంటూరు వెస్ట్ మండల పరిధిలోని చినపలకలూరులో 9.463 ఎకరాలు, మేడికొండూరు మండలం సిరిపురం పరిధిలో 15.809 ఎకరాలు, అదే మండలం మందపాడులో 7.35 ఎకరాలు, విసదలలో పది సెంట్లు, నల్లపాడులో 5.958 ఎకరాలు అవసరమయ్యాయి. వీటిపై అభ్యంతరాలుంటే గుంటూరు ఆర్డీవోకు నెలరోజుల్లోపు అందజేయాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. గుంటూరు ఆర్డీవో కార్యాలయం కాంపిటెంట్ అథారిటీగా ఉంది. రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో దక్షిణ మధ్య రైల్వే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+