సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ : స్టేషన్లు - టైమింగ్స్ ఇలా, ఆ ఒక్క రోజు మినహా..!!

తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ పట్టాలెక్కుతోంది. ఏప్రిల్ 8న సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ప్రారంభం కానుంది. ప్రారంభం రోజున ప్రయాణీకులను అనుమతించరు. 9వ తేదీన తిరుపతి నుంచి ఈ రైలు ప్రారంభం అవుతుంది. 10వ తేదీ నుంచి రెగ్యులర్ గా ఈ రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి స్టేషన్లు - సమయాలను రైల్వే అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకూ నారాయణాద్రి ప్రయాణిస్తున్న ఈ మార్గంలోనే వందేభారత్ కొనసాగనుంది. మంగళవారం మినహా వారంలో ప్రతీ రోజు కొత్త వందేభారత్ అందుబాటులో ఉండనుంది.

8.30 గంటల్లో సికింద్రాబాద్ - తిరుపతి
నిత్యం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వేలాది మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడుస్తున్న వందేభారత్ కు వస్తున్న ఆదరణ చూసిన తరువాత వెంటనే ఈ రైలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఏ మార్గంలో దీనిని నడపాలనే దాని పైన సుదీర్ఘ కసరత్తు జరిగింది. ఉత్తరాది నుంచి పలు రైళ్లు సికింద్రాబాద్ మీదుగా ఖాజీపేట - విజయవాడ -తెనాలి మీదుగా తిరుపతికి చేరుకుంటున్నాయి. దీంతో, డిమాండ్ - సమయం కలిసొచ్చేలా సికింద్రాబాద్ - తిరుపతి- సికింద్రాబాద్ వందేభారత్ ను ప్రవేశ పెడుతున్నారు. 8న అధికారికంగా ప్రారంభించినా, 10వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు 12 గంటల వరకు ఉన్న ఈ మార్గంలో ప్రయాణం వందేభారత్ ద్వారా 8.30 గంటల్లోనే గమ్యస్థానం చేరుకొనేలా నిర్ణయించారు.

Railway officials announced Secunderabad - Tirupati Vande Bharat halting stations and timings schedule

స్టేషన్లు..టైమ్సింగ్ ప్రకటన
సికింద్రాబాద్ - తిరుపతి-తిరుపతి మధ్య వందేభారత్ షెడ్యూల్ ను అధికారులు ప్రకటించారు. వారంలో మంగళవారం మినహా ప్రతీ రోజు ఈ రైలు రాకపోకలు ఉంటాయి. వందేభారత్ ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ లో బయల్దేరి నల్గొండ కు 07.19కి, గుంటూరుకు 9.45, ఒంగోలుకు 11.09, నెల్లూరుకు 12.29 చేరుకొని..అక్కడ నుంచి మధ్నాహ్నం తిరుపతికి 14.30 చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో భాగంగా.. తిరుపతిలో మధ్నాహ్నం 15.15కి బయల్దేరి..నెల్లూరుకు సాయంత్రం 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండకు 22.10, సికింద్రాబాద్ కు రాత్రి 23.45కి చేరుకుంటుంది. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య కేవలం నాలుగు స్టేషన్లకు మాత్రమే హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.

Railway officials announced Secunderabad - Tirupati Vande Bharat halting stations and timings schedule

8న లాంఛనంగా ప్రారంభం
ఏప్రిల్ 8న ప్రధాని మోదీ సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ను లాంఛనంగా ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇది రెండో వందేభారత్ కానుంది. సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ వందేభారత్‌ రైలులో ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ధర రూ. 2వేలు పైగా ఉండే అవకాశం ఉంది. ఏసీ చైర్ కారు రూ. 1150గా ఉంటుందని సమాచారం. ఈ రోజుల టికెట్ ధరలతో పాటుగా రైలు నెంబర్లను అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఇక.. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్ - పూణే, కాచిగూడ - బెంగళూరు మధ్య త్వరలోనే ప్రారంభించనున్నట్లు సమాచారం. లక్షలాది మంది భక్తులు నిత్యం తరలి వచ్చే తిరుమలకు ఇప్పుడు వందేభారత్ ద్వారా మరింత వెసులుబాటు కలగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+