విశాఖ - సికింద్రాబాద్ వందేభారత్ రద్దు - ప్రత్యామ్నాయంగా..!!
రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి వందేభారత్ రైలుగా ప్రారంభమైన విశాఖ - సికింద్రాబాద్ రైలును ఈ రోజు (గురువారం) రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వందేభారత్ స్థానంలో మరో రైలును అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. వందేభారత్ నడిచే మార్గంలోనే..ఆ స్టేషన్లలోనే హాల్ట్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు వివరించారు. సాంకేతిక కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
వారంలో ఆరు రోజులు నడిచే విశాఖ - సికింద్రాబాద్ వందేభారత్ రైలు ఈ రోజు రద్దు అయింది. సాంకేతిక కారణాలతో విశాఖ - సికింద్రాబాద్ వందేభారత్ ను గురువారం రద్దు చేస్తూ వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు ప్రకటించారు. ఈ మార్గంలో ఇదే సమయంలో మరో రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. వందేభారత్ నడిచే సమయాల్లోనే అదే మార్గంలో ఈ ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ప్రయాణీకులు సహకరించాలని కోరారు. వందేభారత్ ప్రతీ రోజు ఉదయం విశాఖలో బయల్దేరి మధ్నాహ్నం సికింద్రబాద్ చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్ లో బయల్దేరి రాత్రికి విశాఖ చేరుకుంటుంది. ఈ రోజు ఈ రైలు రద్దు అయింది.

వందేభారత్ రద్దు కావటంతో ముందుగా రిజర్వ్ చేసుకున్న ప్రయాణీకులకు ఈ తాజా నిర్ణయం సమస్యగా మారింది. రైలు రద్దు విషయాన్ని అధికారులు ఈ ఉదయం ప్రకటించారు. దీంతో, ప్రత్యామ్నాయ రైలులో ప్రయాణం చేయాలా వద్దా అనే డైలామలో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. పూర్తి సమాచారం కోసం సమీప రైల్వే స్టేషనల్లో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. విశాఖ - సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందేభారత్ కు ఉన్న ఆదరణ కారణగా ముందుగానే రిజర్వేషన్లు పూర్తవుతున్నాయి. ఖాళీలు దొరకటం లేదు. తక్కువ సమయంలో గమ్య స్థానంలో చేరుకొనే అవకాశం ఉండటంతో ప్రయాణీకులు ఈ వందేభారత్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు చివరి నిమిషంలో రద్దు నిర్ణయం తీసుకున్నారు.
TRAIN CANCELLED ALERT:*
— DRMWALTAIR (@DRMWaltairECoR) August 17, 2023
Train No:20833 Visakhapatnam -Secunderabad Vanda Bharat Express is Cancelled today i. e 17.08.2023 Inconvenience is regretted. @RailMinIndia @EastCoastRail @drmvijayawada @drmsecunderabad @SCRailwayIndia pic.twitter.com/wQ7NOeDYG7












Click it and Unblock the Notifications