తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రైళ్లకు హాల్టులు - టైమింగ్స్ , ఎక్కడెక్కడ..!!
తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే ప్రధాన రైళ్లకు హాల్ట్ ల పైన రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన స్టేషన్లలో ఆయా రైళ్లు ప్రయోగాత్మక ప్రాతిపదికన ఆరు నెలల పాటు ఆగుతాయని అధికారులు వెల్లడించారు. రైల్వే శాఖ ప్రకటించిన రైళ్లల్లో నారాయాణాద్రి..దక్షిణ్..చార్మినార్ సహా 40 రైళ్లు ఉన్నాయి. ప్రధానంగా పలు ముఖ్యమైన స్టేషన్లలో హాల్టింగ్ కోసం అభ్యర్ధనలు వచ్చాయి. వీటిని పరిగణలోకి తీసుకొని రైల్వే శాఖ తాజా నిర్ణయం తీసుకుంది.
లింగంపల్లి నుంచి నుంచి తిరుపతికి వెళ్లే నారాయాణాద్రి ఎక్స్ ప్రెస్ మిర్యాలగూడెంలో ఆగుతున్నా..తిరుపతి నుంచి వచ్చే ప్రయాణంలో స్టాపేజీ లేదు. దీని కారణంగా తిరుపతి నుంచి మిర్యాలగూడెం వచ్చే వారు నల్గొండ స్టేషన్ లో దిగాల్సి వచ్చేది. అక్కడ నుంచి ప్రయాణీకులు తిరిగి మిర్యాలగూడెం వెళ్లాలంటే ఇబ్బందులు తప్పటం లేదు.

దీంతో..ఇక నుంచి సికింద్రాబాద్ - తిరుపతి నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ అర్దరాత్రి 2.44కి మిర్యాలగూడెంలో ఆగనుంది. అదే విధంగా భువనేశ్వర్ - సికింద్రాబాద్ (17015) విశాఖ ఎక్స్ ప్రెస్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ (12603), నాగర్ సోల్ -నర్సాపూర్ (17232) ఎక్స్ ప్రెస్ లను మిర్యాలగూడెం, నల్గొండ స్టేషన్లలో ఆపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
నర్సాపూర్ - లింగంపల్లి ఎక్స్ ప్రెస్ (17255)కు నల్గొండలో, సింగరేణి ఎక్స్ ప్రెస్ (17033)కు ఆసిఫాబాద్ లో, దక్షిణ్(12721) సంఘమిత్ర (12295) ఎక్స్ ప్రెస్ లకు రామంగుండంలో, సికింద్రాబాద్ - రాయపూర్ ఎక్స్ ప్రెస్ (12271)కు జమ్మికుంటలో, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ (12708)కి మంచిర్యాలలో, సికింద్రబాద్ - మణుగూరు ఎక్స్ ప్రెస్ (12745)కి కారేపల్లిలో, చార్మినార్ ఎక్స్ ప్రెస్ (12759)కి డోర్నకల్ లో, పద్మావతి ఎక్స్ ప్రెస్ (12763), విశాఖ- మహబూబ్ నగర్ ఎక్స్ ప్రెస్ (12861)లకు మధరిలో హాల్ట్ ఇవ్వాలని నిర్ణయించారు.

అదే విధంగా యశ్వంత్ పూర్ - కాచిగూడ ఎక్స్ ప్రెస్ (16569)కి శ్రీరాం నగర్, జడ్చర్ల, షాద్ నగర్ స్టేష్లన్లో హాల్టు ఇచ్చారు. రైల్వే శాఖ తాజాగా నిర్ణయించిన ఈ స్టాపేజీ సౌకర్యం ఈ నెల 5,6,7,8 తేదీల నుంచి అమల్లోకి రానుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications