సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ వేళల మార్పు, కొత్త టైమింగ్స్..!!

మొంథా తుఫాను ప్రభావం రైల్వే పైన పడింది. తుఫాను కారణంగా పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసారు. విశాఖ కేంద్రంగా వెళ్లే పలు ప్రధాన రైళ్లను రద్దు చేయటంతో పాటుగా అనేక సర్వీసుల ను దారి మళ్లించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనూ రైళ్లను నిలుపుదల చేయాల్సి వచ్చింది. డోర్న కల్ సమీపంలో ట్రాక్ పైకి నీళ్లు రావటంతో విజయవాడ - హైదరాబాద్ మార్గంలో రైళ్ల రాకపోక లకు అంతరాయం కలిగింది. కాగా, ఇప్పుడు సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ వేళలపై కీలక ప్రకటన చేసింది.

తుఫాను కారణంగా రైళ్ల రాకపోకల పైన పడిన ప్రభావం కారణంగా సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌ మారింది. దీనికి సంబంధించి ప్రయాణీకుల కు రైల్వే శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. వందేభారత్ ప్రతీ రోజు ఉదయం విశాఖ నుంచి బయల్దేరి మధ్యాహ్నం సమయానికి సికింద్రాబాద్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు సికింద్రా బాద్ నుంచి బయల్దేరి రాత్రికి విశాఖ చేరుకుంటుంది. కాగా.. ఈ మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయల్దేరాల్సిన వందేభారత్ ను అధికారులు దీన్ని రీషెడ్యూల్ చేశారు. ఈరోజు(శుక్రవారం) రాత్రి 9గంటలకు ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుందని ప్రకటించారు. అంటే ఈ రైలు సుమారు 6 గంటలు ఆలస్యంగా నడవనుంది.

railway-officials-key-announcement-over-rescheduling-of-secunderabad-visakha-vande-bharat

అయితే..గురువారం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. మధ్యాహ్నం 3గంటలకు స్టార్ట్ కావాల్సిన ట్రైన్.. రాత్రి 11.35 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరింది. ఈ రీషెడ్యూల్ కార ణంగా, ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని రైల్వే శాఖ కోరింది. టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఈ మార్పును గమనించి, రైలు స్టేషన్‌కు కొత్త సమయానికి చేరుకో వాలని అధికారులు సూచించారు. కాగా సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సాధారణంగా 8 గంటల 35 నిమిషాల వ్యవధిలో 699 కిలోమీటర్ల గమ్యాన్ని చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే వందేభారత్ వరంగల్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, రాజ మండ్రి, సామర్లకోట జంక్షన్ వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. రీషెడ్యూల్ కారణంగా ఈ స్టేషన్లలో రైలు రాకపోకల సమయాలు కూడా మారనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+