Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రయాణికుల కోసం రైల్వే మరో సదుపాయం

రైళ్లలో ప్రయాణించే వారికి కోసం రైల్వే శాఖ (Indian Railway) కొత్తగా మరో సదుపాయం తీసుకొచ్చింది. ప్రయాణంలో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకునే విధానాన్ని మరింత సులభతరం చేసింది. వాట్సాప్‌ (Whatsapp) ద్వారా కూడా ఈ సేవలను పొందే సౌకర్యం కల్పించింది. ఈ-కేటరింగ్‌ సేవలను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంలో భాగంగా ముందుగా కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో వీటిని అమలు చేస్తున్నారు.

irctc ప్రస్తుతం www.ecatering.irctc.co.in, ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌ అనే యాప్‌ ద్వారా ఈ సదుపాయాన్ని అందజేస్తోంది. ఇప్పుడు 87500 01323 అనే వాట్సాప్‌ నెంబర్‌ను అందుబాటులో ఉంచింది. ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోగానే ఈ నెంబర్‌ నుంచి ఈ-కేటరింగ్‌ సర్వీస్‌ సేవలకు సంబంధించి www.ecatering.irctc.co.in వెబ్‌సైట్‌ లింక్ వస్తుంది. అక్కడ అందుబాటులో ఉన్న స్టేషన్లలో తమకు నచ్చిన రెస్టారెంట్‌ నుంచి ఆహారాన్ని ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ కేటరింగ్‌కు సంబంధించిన సేవలను ఏఐ ఆధారిత చాట్‌బోట్‌ నేరుగా అందజేస్తుంది.

 train

ప్రస్తుతం irctc ఈ-కేటరింగ్‌ ద్వారా రోజుకు 50 వేల భోజనాలను ప్రయాణికులకు అందజేస్తున్నారు. ప్రస్తుతానికి ఎంపిక చేసిన రైళ్లలో మాత్రమే వీటిని అదుబాటులోకి తెచ్చారు. వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా మిగిలిన రైళ్లకు కూడా దీన్ని వర్తింపచేయాలని అధికారులు యోచిస్తున్నారు. జూప్‌ అనే థర్డ్‌పార్టీ ఆన్‌లైన్‌ పుడ్‌ ప్లాట్‌ఫాం గత సంవత్సరం వాట్సాప్‌ చాట్‌బోట్‌ ద్వారా రైళ్లలోకి ఆహారాన్ని అందించే సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+