తిరుమల ప్లాన్ చేసుకుంటున్న వారికి రైల్వే బిగ్ అప్డేట్, కొత్తగా అందుబాటులలోకి..!!
తిరుమల భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవిలో సాధారణంగా తిరుమలకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేసారు. రెగ్యులర్ రైళ్లలో ఇప్పటికే వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. దీంతో.. పలు ప్రాంతాల నుంచి తిరుపతికి రైళ్లను ఖరారు చేసారు. స్పెషల్స్ రైళ్లను రెగ్యులర్ మార్పు చేస్తూ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు స్పష్టత ఇచ్చారు.
తిరుపతికి వేసవిలో ప్రత్యేక రైళ్లను అధికారులు ప్రకటించారు. అందులో భాగంగా తిరుపతి-చర్లపల్లి, చర్లపల్లి-తిరుచానూరు, తిరుపతి-అకోలా, నాందేడ్-తిరుచానూరు, కాకినాడ టౌన్-మైసూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. చర్లపల్లి-తిరుచానూరు రూట్లో ఏప్రిల్ 12 నుంచి 15 వరకు ప్రత్యేక రైళ్లు నడవనుండగా.. తిరుపతి-చర్లపల్లి మార్గంలో 14 నుంచి 16వ తేదీల మధ్య ప్రత్యేకంగా ఇవి నడవనున్నాయి. ఇక, తిరుపతి-శ్రీకాకుళం మధ్య హంసఫర్ వీక్లీ రైలు ప్రవేశపెట్టారు. శ్రీకాకుళం-తిరుపతి(17440) రైలు ఈ నెల 13న శ్రీకాకుళం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతుంది. ఇక తిరుపతి-శ్రీకాకుళం ట్రైన్(17439) తిరుపతిలో ఈ నెల 19న సాయంత్రం 4.55కి బయల్దేరుతుంది.

రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు కేటాయింపు
శ్రీకాకుళం- తిరుపతి మధ్య ప్రకటించిన స్పెషల్ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకొట, యలమంచలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్త వలస, విజయనగరం, బీపురుపల్లి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఇక.. భారత్ గౌరవ్ ప్రత్యేక టూరిస్ట్ రైళ్లను ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 14 నుంచి జూన్ 12 మధ్య హైదరాబాద్ నుంచి నాలుగు రైళ్లు ప్రకటించారు. పూరి కోణార్క్-బైద్యనాథ్, థామ్-వారణాసి, అయోధ్య-ప్రయోగరాజ్ యాత్ర ఏప్రిల్ 28న ప్రారంభమవుతుంది. మే 7వ తేదీన ఇది ముగుస్తుంది. సికింద్రాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. అదే విధంగా అరుణాచలం-చిదంబరం యాత్ర మే 24న ప్రారంభం కానుంది. అటు యమునా నది పుష్కరాల కోసం ప్రత్యేక యాత్ర జూన్ 3న ప్రారంభమవుతుంది. ఇక.. తిరుపతికి రద్దీ వేళ.. రెగ్యులర్ రైళ్లల్లో ఉన్న డిమాండ్ కు అనుగుణంగా రైల్వే మరిన్ని నిర్ణయాలకు సిద్దం అవుతోంది.












Click it and Unblock the Notifications