తిరుపతికి కొత్తగా వందేభారత్, ముహూర్తం ఫిక్స్ - రూట్..షెడ్యూల్..!!
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. తిరుపతికి మరో వందేభారత్ ఖరారైంది. కొంత కాలంగా వేచి చూస్తున్న వందేభారత్ పట్టాలెక్కేందుకు ముమూర్తం ఫిక్స్ చేసారు. తెలుగు రాష్ట్రాలలో వందే భారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో, కొత్తగా మరో వందేభారత్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ కొత్త రైలును విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్ ట్రైన్ నడి పేందుకు నిర్ణయించారు. తిరుపతి మీదుగా బెంగళూరు వెళ్లేలా రూట్ ఖరారు చేసారు. ఈ రైలు ద్వారా కేవలం తొమ్మిది గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు.. నాలుగున్నార గంటల్లోనే తిరుపతి చేరుకునేలా షెడ్యూల్ ఫిక్స్ చేసారు.
తిరుమల, బెంగళూరుకు వెళ్లే ప్రయాణీకుల కోసం రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ నుంచి బెంగళూరుకు వయా తిరుపతి వందేభారత్ కు ఇప్పటికే ఆమోదం దక్కినా..ప్రారంభానికి ఆలస్యం అయింది. ఇప్పుడు పట్టాలెక్కేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఇప్పటికే విజయవాడ నుంచి చెన్నైకు ప్రస్తుతం వందేభారత్ నడుస్తోంది. బెంగళూరుకు కేటాయించాలనే వినతి మేరకు రైల్వే అధికారులు మే నెలలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా, కోచ్ లు సమస్య కారణంగా రైలు ఆలస్యం అయిందని తెలుస్తోంది. డిసెంబర్ 10న ఈ రైలు పట్టాలెక్కిచేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ఈ రైలు అందుబాటులోకి వస్తే బెంగళూరు ప్రయాణం ఇతర రైళ్ల కంటే 3 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది.

ఈ వందే భారత్ ట్రైన్ బెంగళూరు వెళ్లే వారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకూ ఉపయోగపడ నుంది. మొత్తం 8 బోగీల్లో 7 AC చైర్‌కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ ఉండనున్నాయి. ఈ వందే భారత్ ట్రైన్ మంగళవారం మినహా వారానికి 6 రోజుల పాటు నడవనుంది. నాలుగున్నార గంటల్లో తిరుపతికి కాగా, ఈ రైలుకు నెంబర్ తో పాటుగా రూట్.. షెడ్యూల్ ఖరారు చేసారు. ఈ ట్రైన్ (20711) విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి తెనాలి 5.39, ఒంగోలు 6.28, నెల్లూరు 7.43, తిరుపతి 9.45, చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం 13.38, ఎస్‌ఎంవీటీ బెంగళూరుకి 14.15 గంటలకు చేరుతుంది.
అదే విధంగా తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ ట్రైన్ (20712) బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు స్టార్ట్ అయి, కృష్ణరాజపురం 14.58, కాట్పాడి 17.23, చిత్తూరు 17.49, తిరుపతి 18.55, నెల్లూరు 20.18, ఒంగోలు 21.29, తెనాలి 22.42, విజయవాడకు 23.45 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు అందు బాటులోకి రావటం ద్వారా తిరుపతి.. బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు వెసులుబాటు కలగనుంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications