హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంతా నేలమట్టం, ఇళ్ల మునక: వర్షం విషాదం(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నుండి పలు ప్రాంతాల్లో వర్షం కొద్దిగా తెరపిన పడుతోంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం తదితర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం కుండపోతగా కురుస్తూనే ఉంది.

నాగావళి వరద నీటితో పోటెత్తింది. గరుగుమిల్లి మండలం తోటపల్లి బ్యారేజీ వద్ద ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని దిగువగు విడుదల చేస్తున్నారు. కొమరాడ మండలంలోని జంఝావతి జలాశయం నుండి ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

విశాఖలో కురుస్తున్న వర్షాలు, నష్టం పైన మంత్రి గంటా శ్రీనివాస రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వర్షం, వరదలు, నష్టం పైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. మరోవైపు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కృష్ణా జిల్లాలో బాధితులను పరామర్శిస్తారు.

విజయవాడ

విజయవాడ

గత ఐదు రోజులుగా కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి మహోద్ధృతంగా వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీ వద్ద కనీస నీటిమట్టం 12 అడుగులు కాగా దాన్ని మించి 13.4 అడుగుల స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. మొత్తం 70 గేట్లను ముందుగానే 12 అడుగుల మేర ఎత్తారు.

విజయవాడ 2

విజయవాడ 2

నదీ పరివాహక ప్రాంతంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విజయవాడలో నాలుగు ప్రాంతాల్లో సహాయక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

విజయవాడ 3

విజయవాడ 3

శనివారం రాత్రి 7 గంటల సమయానికి 4 లక్షల 70 వేల క్యూసెక్కుల నీరు నేరుగా సముద్రంలోకి చేరుతున్నది. ముందు జాగ్రత్త చర్యగా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

విజయవాడ 4

విజయవాడ 4

నదీ పరివాహక ప్రాంతంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విజయవాడలో నాలుగు ప్రాంతాల్లో సహాయక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీట మునిగిన ఓ ప్రాంతం.

శ్రీకాకుళం 1

శ్రీకాకుళం 1

శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల కండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో నీట మునిగిన మొక్కజోన్న పంట.

శ్రీకాకుళం 2

శ్రీకాకుళం 2

శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల కండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో నీట మునిగిన ఓ ప్రాంతం.

English summary

 Hyderabad public life drastically affected due to continuous rains. Tanks breached and low lying areas flooded with water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X