వర్షాలు: రోడ్లు నిండాయి, వాగులు పొంగాయి (పిక్చర్స్)
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ద్రోణికి తోడు ఈశాన్య రుతువుల కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రుజోలుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దయింది. దీంతో రాజధాని హైదరాబాదుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. పట్టణాల్లో భారీగా స్తంభించిన ట్రాఫిక్‌తో జనజీవనం అస్తవ్యస్తమైంది.
అనేక జిల్లాల్లో ముఖ్యంగా కృష్ణా, గోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగియి. వరి, పత్తి, మిర్చి లాంటి పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. పలు పట్టణాల్లో అనేక కాలనీల్లోకి నీళ్లు చేరడంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. వాగులు రహదారులపై పొంగి ప్రవహిస్తూ ఉండడంతో ఆర్టీసీ బస్సు సర్వీసులు ఆగిపోయి ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అల్పపీడనం ప్రభావం ప్రకాశం జిల్లాపై తీవ్రంగా ఉంది.
ఒంగోలులో 230 కెవి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా మునిగి పోవడంతో బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో వాగులకు గండ్లు పడ్డాయి. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ముత్తుకూరు మండలంలో 19 సెంటీమీటర్ల వర్షం కురవగా, తోటపల్లి గూడురులో 18 సెంటీమీటర్లు, నెల్లూరులో 7.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
మరోవైపు భారీ వర్షంతో హైదరాబాద్ నగరవాసులు బుధవారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం వరకు చెదురుమదురుగా పడిన వాన ఆ తర్వాత జోరందుకుంది. రాత్రి 7.30 గంటల వరకు 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా భారీ వర్షాల కారణంగా గోడ కూలి రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు.

వర్షం 1
భారీ వర్షాలతో హైదరాబాదులోని ఖైరతాబాద్, అమీర్‌పేట, ఆర్టీసీ క్రాస్‌రోడ్, వీఎస్‌టీ, నల్లకుంట సిండికేట్ బ్యాంక్, చే నెంబర్, మోజంజాహి మార్కెట్, నాంపల్లి, లిబర్టీ, అఫ్జల్‌గంజ్, కోఠి, ఆబిడ్స్ ప్రాంతాల్లోని చౌరస్తాల్లో మోకాలి లోతున నీరు నిలిచింది.

వర్షం 2
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వర్షం 3
రాత్రి 7.30 గంటల వరకు 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆఫీసులకు వెళ్లిన వారు ఇంటికి చేరుకునే సమయంలో కుంభవృష్టి కురవడంతో చాలాచోట్ల రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి.

వర్షం 4
ఈశాన్య రుతుపవనాల రాకతో హైదరాబాద్‌లో బుధవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం వరకు చెదురుమదురుగా పడిన వాన ఆ తర్వాత జోరందుకుంది.

వర్షం 5
72 గంటల నుంచి ఎడతెరిపి లేని వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి.

వర్షం 6
ప్రకాశం జిల్లాపై తీవ్రంగా ఉంది. జిల్లా ముఖ్యపట్టణమైన ఒంగోలులో 230 కెవి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా మునిగి పోవడంతో బుధవారం మధ్యాహ్నంనుంచి రాత్రి దాకా నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

వర్షం 7
మార్కాపురం డివిజన్‌లో నల్లమల కొండలనుంచి ప్రవహించే సగిలేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పలు కాలనీలు జలమయమైనాయి.

వర్షం 8
నెల్లూరు జిల్లాలోనూ గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో అత్యధికంగా ముత్తుకూరు మండలంలో 19 సెంటీమీటర్ల వర్షం కురవగా, తోటపల్లి గూడురులో 18 సెంటీమీటర్లు, నెల్లూరులో 7.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

వర్షం 9
జిల్లాల్లో పత్తి, మిర్చి, ఇతర వాణిజ్య పంటలు నీట మునిగి పోగా, వేలాది ఎకరాల్లో వరి పైరు నేలకొరిగి పోయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పంట నేలవాలి పోయి ఉంది.

వర్షం 10
ఆఫీసులకు వెళ్లిన వారు ఇంటికి చేరుకునే సమయంలో కుంభవృష్టి కురవడంతో చాలాచోట్ల రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. పాఠశాల విద్యార్థులు వర్షంలో తడుచుకుంటూనే ఇళ్లకు చేరాల్సి వచ్చింది.

వర్షం 11
మొన్నటికి మొన్న ఫైలిన్ తుపాను తాకిడికి గురయి ఇంకా పూర్తిగా తేరుకోని శ్రీకాకుళం జిల్లాతో పాటుగా విజయనగరం, విశాఖ జిల్లాల్లో కూడా గత రెండు రోజులుగా భారీ వర్షాలకు పలు చరువులకు గండ్లు పడ్డాయి.

వర్షం 12
వందల పూరిళ్లు నేలమట్టమైనాయి. రోడ్లు, వంతెనలు దెబ్బ తిని రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ నిలిచిపోయింది.

వర్షం 13
రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నల్గొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో పత్తి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి.

వర్షం 14
రహదారులన్నీ భారీ వర్షాలకు దెబ్బ తినడంతో పలు గ్రామాలకు రాకపోకలు కష్టమైనాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.

వర్షం 15
తెలంగాణ జిల్లాల్లోను భారీ వర్షాలు విధ్వంసాన్ని సృష్టించాయి. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నల్గొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో పత్తి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి.

వర్షం 16
రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. బస్టాండ్లలో నీరు నిలిచిపోయింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం రైల్వే శాఖపైనా పడింది.












Click it and Unblock the Notifications