'కర్నూలును ఎపి రాజధానిగా చేయాల్సిందే, లేదంటే...'

కర్నూలు రాజధాని కోసం రాయలసీమ ప్రజాప్రతినిధులు కృషి చేయని పక్షంలో కాంగ్రెసు పార్టీకి పట్టిన గతే వారుకి పడుతుందని హెచ్చరించారు. కర్నూలు రాజధానిగా ఏర్పడితే రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాయలసీమకు రాజధాని రాకపోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం మొదలయ్యే అవకాశముందని హెచ్చరించారు.
ఫీజుల పెంపు లేదు: కామినేని శ్రీనివాస్
ఈ ఏడాది మెడికల్ కాలేజిలలో ఫీజులు పెంచేది లేదని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గతేడాది ఫీజులే ప్రస్తుతానికి కొనసాగిస్తున్నామన్నారు. ఎంబీబీఎస్ ఫీజులపై వచ్చే నెల మొదటి వారంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. విభజన కారణంగా కోల్పోయిన 350 సీట్లను తిరిగి సాధించుకుంటామని చెప్పారు. దీనిపై కేంద్రం ద్వారా కోర్టును ఆశ్రయిస్తామన్నారు.
ఎంసీఐ కేటాయించిన 450 సీట్లలో 150 సీట్లను పద్మావతి మహిళా యూనివర్సిటీ వైద్య కళాశాలకు కేటాయించారని ఆయన పేర్కొన్నారు. మిగిలిన సీట్లను ఇతర కళాశాలలకు కేటాయించారన్నారు. మెడికల్ కౌన్సిలింగ్ లో గత ఏడాది చేపట్టిన విధానాన్నే అవలంభించనున్నామని కామినేని చెప్పారు.












Click it and Unblock the Notifications