జగన్ సీఎం అయితే వెంటనే కలవాలా ? పృధ్వీ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన రాజేంద్రప్రసాద్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తెలుగు సినీ పరిశ్రమకు ఇష్టం లేదని, అందుకే ఆయన సీఎం అయిన తర్వాత సినీ పరిశ్రమ నుండి ఏ ఒక్కరూ కూడా వెళ్లి మర్యాదపూర్వకంగా కలవలేదని ఎస్‌వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీ సినీ పరిశ్రమ గురించి సంచలన ఆరోపణలు చేశారు. ఇక దీనిపై ఇప్పటికే పోసాని కృష్ణ మురళి ఇప్పటికే తన స్పందన తెలియజేశారు. పృధ్వీ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇక తాజాగా పృధ్వీ వ్యాఖలపై ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కాస్త ఘాటుగానే స్పందించారు.

పృధ్వీ వ్యాఖలకు ఇటీవల వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కౌంటర్
మొన్నటికి మొన్న పృధ్వీ వ్యాఖలపై వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి పృథ్వీ తొందరపడి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. జగన్ సీఎం కావడం సినీ పరిశ్రమ పెద్దలకు ఇష్టం లేదన్న వ్యాఖ్యలు "బిగ్ మిస్టేక్ "గా అభివర్ణించారు. సీఎం అయిన జగన్ ని కలిసి, ఓ పూల దండ వేసి, అభినందిస్తే, ఆయనపై ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేదనుకుంటే పొరపాటేనని పోసాని అభిప్రాయపడ్డారు. అలా అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు గెలిచారని, అప్పుడు తానేమి చంద్రబాబును కలిసి అభినందించలేదని, అంటే, చంద్రబాబు సీఎం కావడం తనకు ఇష్టం లేదని అనుకోవడం కరెక్టు కాదు కదా అని ఆయన లాజిక్ మాట్లాడారు .

మరోసారి పృధ్వీ వ్యాఖ్యలపై రాజేంద్ర ప్రసాద్ సెటైర్లు
ఇక తాజాగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ సీఎంను వెంటనే కలవడానికి సినీ నటులేమీ వ్యాపారవేత్తలు కాదని ఆయన అన్నారు. జగన్ సీఎం అయితే వెంటనే కలవాలని ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. వ్యాపారాలు చేసే వారైతే కలుస్తారేమో కానీ అసలు కళాకారులు సీఎంను కలవాలన్న నిబంధన ఏమీ లేదని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాస్త కుదురుకున్నాక తప్పకుండా కలుస్తామని రాజేంద్రప్రసాద్ తెలిపారు.

త్వరలో సీఎంను కలుస్తామని వెల్లడించిన నటకిరీటి రాజేంద్రప్రసాద్
సినీ పరిశ్రమకు వీళ్ళు , వాళ్ళు అన్న తేడాలేవీ లేవని , ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారిని సముచితంగా గౌరవించే విధానం సినీ పరిశ్రమ వర్గాల్లో ఉందని ఆయన క్లారిటీ ఇచ్చారు. రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ పరిశ్రమ పట్ల చాలా సానుకులంగా ఉన్నారని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు . లేనిపోని ఊహాగానాలు సృష్టిస్తే బాగోదు అన్న భావన ఆయన తన మాటల్లో వ్యక్తం చేశారు. ప్రజలకు తాగునీరందించే ముఖ్యమంత్రి తమకు దేవుడని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యనించారు. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేడు కలవాల్సిఉందని, కొన్ని కారణాల వల్ల మరో రెండు మూడురోజుల్లో కలిసేందుకు ఆయన అపాయింటుమెంట్ ఇచ్చారని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
-
ఆశాభోస్లే - లతా మంగేష్కర్.. అక్క చెల్లెల మధ్య అసలు గొడవేంటి ??? -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ??? -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..!












Click it and Unblock the Notifications