Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీని వీడటంపై మహాసేన రాజేష్ షాకింగ్ కామెంట్స్

సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న వారి లిస్ట్‌లో మహాసేన రాజేష్ మొదటి వరుసలో ఉంటారు. యూట్యూబ్ వేదికగా దళితుల సమస్యలపై మహాసేన రాజేష్ తనదైనశైలిలో స్పందిస్తుంటారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కృషి చేసిన మహాసేన రాజేష్..తరువాత జరిగిన రాజకీయ పరిణమాలతో జనసేన పార్టీకి మద్దతుగా యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు చేశారు. ఇక జనసేనలో చేరడమే తరువాయి అనుకున్న తరుణంలో పవన్ కల్యాణ్‌కు షాకిస్తూ..టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన తరువాత మహాసేన రాజేష్ తన దూకుడును మరింత పెంచారు. నారా లోకేష్, చంద్రబాబు సభల్లో ప్రసంగిస్తూ.. ఒక్కసారిగా స్టేట్ లీడర్‌గా మారిపోయారు. మహాసేన రాజేష్ క్రేజ్‌ను గుర్తించిన చంద్రబాబు తొలి టీడీపీ జాబితాలోనే చోటు కల్పించారు.మహాసేన రాజేష్‌కు టికెట్ ఖారారు చేస్తూ ఆయన పేరును ప్రకటించారు.టీడీపీ తొలి జాబితాలో పి. గన్నవరం (కోనసీమ జిల్లా) అభ్యర్థిగా రాజేష్‌ను ప్రకటించారు. రాజేష్‌కు టికెట్ కేటాయించిన మరుక్షణం నుంచే హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

Rajesh Mahasena Gives Clarity On Party Change

గతంలో సోషల్ మీడియా వేదికగా రాజేష్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ నిరసనలకు దిగాయి. అటు పి. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన శ్రేణుల నుంచి రాజేష్ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. రాజేష్‌కు టికెట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు జరిగాయి. ఇంటిపోరు పడలేక మహాసేన రాజేష్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. మహాసేన రాజేష్‌ను కావాలనే తప్పించారని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నోర్లులేని మేకల్ని బలి ఇస్తారు.. సింహాన్ని కాదు. మీరు బలి అవుతారో లేక సింహం మాదిరిగా రాష్ట్రాన్ని కాపాడతారో నిర్ణయం మీదే అంటూ రాజేష్‌కు మద్దతుగా ఆయన అనుచరులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో ఆయన టీడీపీని వీడుతున్నారనే ప్రచారం జరిగింది. దీనికితోడు నియోజకవర్గంలో మహాసేన రాజేష్‌ను పిలవకుండానే కార్యక్రమాలు చేపట్టడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన టీడీపీని వీడటం ఖాయం అనుకున్నారంతా.

తాజాగా టీడీపీని వీడటంపై మహాసేన రాజేష్ స్పందించారు. అందరి సూచనలు, సలహాలు మేరకు చంద్రబాబు గారి నాయకత్వంలో టీడీపీలో ఉండాలని నిర్ణయించాం. నామీద నమ్మకముంచిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు. మహాసేన అనేది ఇప్పుడు టీడీపీ ఆస్తి అని, మరొక 30 ఏళ్ల పాటు పార్టీకి సేవలందించాలని ఆయన కోరారు. అందుకు మహాసేన కూడా సిద్ధం అంటూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. దీంతో ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నట్టు స్పష్టం చేసినట్టు అయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+