విజయ్ లియోను వెనక్కు నెట్టిన రజినీకాంత్ జైలర్.. ఎందులోనంటే!!

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాపై ఫ్యాన్స్ ఆశలు, రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్ ఆగస్టులో రిలీజ్ కి సిద్ధమవుతుండగా అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఈ సినిమాతో సరికొత్తగా చూపించబోతున్న నెల్సన్ ఈ సినిమాతో రజనీకాంత్ కు బ్లాక్ బస్టర్ అందిస్తారని భావిస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ కాకముందే సినీ వర్గాలలోను, అభిమానుల లోను బోలెడంత చర్చకు కారణమవుతుంది. తాజాగా జైలర్ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన కావాలయ్యా సాంగ్ భారీ వ్యూస్ తో అదరగొట్టింది. మొదట ఈ సాంగ్ కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ తర్వాత మాత్రం అదరగొట్టింది. ఈ సాంగ్ పై సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రీల్స్ హల్చల్ చేస్తున్నాయి.

vijayrajinikanth

జైలర్ మూవీ నుంచి రిలీజ్ అయిన కావాలయ్యా సాంగ్ కు 12 రోజుల్లో 50 మిలియన్ల వ్యూస్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక తాజాగా దళపతి విజయ్ సినిమాలోని సాంగ్ కూడా యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. దళపతి విజయ్ నటించిన లియో మూవీలోని 'నా రెడీ' సాంగ్ 16 రోజుల్లో 50 మిలియన్ల వ్యూస్ ను అందుకుంది. విజయ్ ను వెనక్కి నెట్టేసి రజనీకాంత్ కావాలయ్యా సాంగ్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది.

దీంతో ఇదే రకమైన ఫలితం బాక్సాఫీస్ వద్ద కూడా పునరావృతం అవుతుందని రజనీకాంత్ ఫ్యాన్స్ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఉంటే తాజాగా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా నుంచి హుకుం సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఈ సాంగ్ కూడా భారీ వ్యూస్ సొంతం చేసుకుంటుంది. ఈ సాంగ్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 6.2 మిలియన్ల వ్యూస్, 445k లైక్స్ ను అందుకుంది.

మొత్తంగా చూస్తే జైలర్ సినిమా పైన ఓ రేంజిలో అంచనాలను పెంచేస్తూ పాటలు హల్చల్ చేస్తున్నాయి. ఒకపక్క దళపతి విజయ్ లియో సినిమా అంచనాలు, మరోపక్క రజనీకాంత్ డైలాగ్ సినిమా అంచనాలు భారీగా కనిపిస్తుంటే, పాటల్లో ఎలాగైతే విజయ్ ను రజనీకాంత్ వెనక్కి నెట్టాడో , సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడం లోను రజనీకాంత్ విజయ్ ను వెనక్కు నెడతాడని తలైవా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+