జగన్ వెళ్తారా-షర్మిల వస్తారా : టైం వచ్చేసింది- ఇద్దరూ కలుస్తారా..!!

వైఎస్ జగన్ - వైఎస్ షర్మిల. ఇద్దరూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక వ్యక్తులు. ఒకే కుటుంబం నుంచి ..ఒక్కటిగా ఎదిగి...ఒకరి కోసం మరొకరు అన్నట్లుగా నడిచిన ఆ ఇద్దరు..వేర్వేరు పార్టీలకు అధినేతలు గా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ రాజకీయం చేస్తున్నారు. ఇక, ఒక పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా వీరిద్దరూ ప్రతీ ఒక్కరికీ గుర్తుకు వస్తారు. అదే రాఖీ పండుగ. అన్నా - చెల్లెల్ల అప్యాయతకు గుర్తుగా చేసుకొనే ఈ పండుగ ఈ అన్నా - చెల్లెలుకు ప్రతీ ఏటా నిజమైన పండుగ. కానీ, ఈ ఏడాది మరో సారి ఆ పండుగ వచ్చేసింది.

 ప్రతీ ఏటా జగన్ - షర్మిల స్పెషల్ అట్రాక్షన్..

ప్రతీ ఏటా జగన్ - షర్మిల స్పెషల్ అట్రాక్షన్..

మరి..ప్రతీ ఏటా చెల్లెలు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లే జగన్ ఈ సారి వెళ్తారా... అన్న కోసం షర్మిల వస్తారా. లేక, తమ మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలతో దూరంగానే ఉంటారా. ఇప్పుడు జగన్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్న పరిణామాలు ఇవి. ప్రతీ ఏటా వైఎస్సార్ జన్మదినం- క్రిస్మస్ - రాఖీ ఈ మూడు పండుగలు ఎవరు ఎక్కడ ఉన్న కలిసి చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. జగన్ వద్దన్నా తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల..ఆ సందర్భంలోనే కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ జన్మకు జగనే తనకు అన్న...తన కంటే వయసులో పెద్దవాడు.. ఆయనకు పార్టీ పెట్టటం ఇష్టం లేదు.

 ఈ సారి ఇద్దరూ కలుస్తారా..

ఈ సారి ఇద్దరూ కలుస్తారా..

అంత మాత్రాన నాకు అన్న కాకుండా పోదు. రాఖీ రోజు అన్నకు రాఖీ కడతా..అంటూ చెప్పుకొచ్చారు. కానీ, ఆ తరువాత మరింత గ్యాప్ కనిపిస్తోంది. వైఎస్సార్ జన్మదినం ( గత నెల 8వ తేదీన) నాడు అక్కడకు ఉదయం సమయంలో తొలుత వెళ్లాలని సీఎం జగన్ భావించారు. అయితే, షర్మిల అదే రోజు పార్టీ ఏర్పాటు ప్రకటన ఉండటంతో ..ఉదయం సమయంలోనే తండ్రికి నివాళి అర్పించాలని నిర్ణయించారు. దీంతో..జగన్ రాజకీయంగా ఎటువంటి అనుమానాలను తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతో తన షెడ్యూల్ మార్చుకున్నారు.

 జగన్ - షర్మిల సిద్దమేనా..

జగన్ - షర్మిల సిద్దమేనా..

సాయంత్రం సమయంలో వెళ్లి తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించారు. పొరుగు రాష్ట్రంతో సఖ్యత కోరుకొనే తాము..అక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదనేది తమ విధామని సీఎం జగన్ ..ఆయన సలహాదారుడు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. అయితే, అదే రోజు సాయంత్రం హైదరాబాద్ లో షర్మిల పార్టీ ఆవిర్భావ సభలో తల్లి విజయమ్మ తన బాధ వ్యక్తం చేసారు. తన పిల్లలు ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉండటం.. దైవ నిర్ణయమేమో అంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాలు-పార్టీలు-అనుమానాలు-విమర్శలు ఎలా ఉన్నా...ఇది అన్నా చెల్లెల్ల సంబంధం చాటే పండుగ రాఖీ.

Recommended Video

    Tata Steel To Take Over Vizag Steel Plant? | Privatization | AP | Oneindia Telugu
     రాజకీయంగానూ ఆ ఇద్దరి వైపే చూపు..

    రాజకీయంగానూ ఆ ఇద్దరి వైపే చూపు..

    ఈ పండుగ రోజు జగన్ తన చెల్లి వద్దకు వెళ్తారా -వెళ్లరా లేక, షర్మిల తన అన్న దగ్గరకు వస్తారా..అది సాధ్యపడుతుందా అనే ఉత్కంఠ ఇప్పుడు వైఎస్సార్ అభిమానుల్లో కనిపిస్తోంది. ఇప్పుడు జగన్ సీఎం హోదాలో ఉన్నారు. పార్టీలోని మహిళా నేతలు ప్రతీ ఏటా షర్మిల రాఖీ కట్టటం పూర్తయిన తరువాత జగన్ కు రాఖీలు కట్టటం జరుగుతూ వస్తోంది. మరి..ఈ సారి షర్మిలతో జగన్ కు రాఖీ కట్టే కార్యక్రమం ఉంటుందా-ఉండదా అనేతి ఇంకా సస్పెన్సే. మరి..షర్మిల రాఖీ లేకుండా పార్టీలోని మహిళా నేతలతో సీఎం జగన్ రాఖీ కట్టించుకుంటారా..అందుకు అంగీకరిస్తారా అనేది మరో చర్చ. దీంతో..ఈ సారి రాఖీ పండుగ ఈ తరహ కొత్త చర్చకు కారణంగా నిలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+