జగన్‌పై ఓపెన్ అయిన రామ్ గోపాల్ వర్మ.. అందుకే ఇదింతా..!!
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ కార్యకర్తలు ఆయనపై పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసి, ఆయన్ను విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.
అయితే పోలీసులు ఇచ్చిన నోటీసులపై రామ్ గోపాల్ వర్మ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో, అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన్ను అరెస్ట్ చేయాని పోలీసులకు నిరాశ ఎదురైంది. రామ్ గోపాల్ వర్మ ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుతిరిగారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ దీనిపై ఓ వీడియో విడుదల చేశారు. పోలీసుల నోటీసులకు తాను ఏడవడం లేదని, వణికిపోవడం లేదని చెప్పారు.

తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలో దెబ్బతీశాయట అంటూ మళ్లీ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. తాను పోస్టు పెట్టిన వారికి కాకుండా.. ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయన్నారు. సినిమా పనిలో ఉండడం వల్ల స్పందించడం కుదరలేదని, తనకు వచ్చిన నోటీసులకు తాను సమాధానం ఇచ్చానని రామ్ గోపాల్ వర్మ గోపాల్ వర్మ తెలిపారు. తాజాగా ఆయన ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌లో మాట్లాడుతూ.. తాను చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు వ్యతిరేకంగా తీసిన సినిమాలకు వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని వర్మ తెలిపారు. తనకు రాజకీయాలు ఏమాత్రం తెలియవని, అయితే నాకు జగన్ అంటే ఇష్టమని, ఆయన్ను వ్యక్తిగతంగా ఇష్టపడతానని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.
జగన్ క్యారెక్టర్ నచ్చుతుందని, అందుకే ఆయన గురించి కామెంట్స్ చేశానని వర్మ తెలిపారు. తనకు రాజకీయాలకు సంబంధం లేదని , బహుశ జగన్‌ను పొగడటం వల్లే తన మీద కేసులు పెట్టి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తన మీద కేసులు పెట్టిన తనని భయపడనని, వాటిని న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. తనకి ఇప్పటికీ జగన్ అంటేనే ఇష్టమని రామ్ గోపాల్ వర్మ మరోసారి కుండబద్ధలు కొట్టేశారు.












Click it and Unblock the Notifications