ఏపీ సమస్యలకు జగన్ తుపాకీ: వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
'ఆంధ్రప్రదేశ్ అనే తుపాకీని పేల్చి, దాని సమస్యలను తీర్చగలిగేది వైఎస్సార్సీపీ అధినేత జగనే' అంటూ ట్వీట్ చేశాడు రాంగోపాల్ వర్మ.
హైదరాబాద్: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు, ట్వీట్లు చేస్తూ సంచలనాలకు మారుపేరుగా ఉండే ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో ట్విట్టర్‌లో స్పందించారు. ఇప్పుడు సినీ నటులను వదిలేసి, రాజకీయాల వైపు తన ట్వీట్స్‌ను మళ్లించాడు.
నిన్న మొన్నటి వరకు చిరంజీవి, పవన్ కల్యాణ్, ఇతర నటులు, వారి నటన, రాజకీయాలపై ట్వీట్లు చేసిన వర్మ.. తాజాగా ఆంధ్రప్రదేశ్ భౌగోళిక చిత్ర పటాన్ని (మ్యాప్) తుపాకీతో పోల్చుతూ కామెంట్లు చేశాడు.

పేలేందుకు సిద్ధంగా ఉన్న తుపాకీలా ఏపీ మ్యాప్ ఉందని తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అలాగే 'ఆంధ్రప్రదేశ్ అనే తుపాకీని పేల్చి, దాని సమస్యలను తీర్చగలిగేది వైఎస్సార్సీపీ అధినేత జగనే' అంటూ ట్వీట్ చేశాడు.

ఒక్కసారిగా జగన్ ను వర్మ ప్రశంసించడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి కొందరు మాత్రం వర్మ నేడు పొగిడాడంటే, రేపు తెగుడుతాడని, జగన్‌ను ఎలా తెగుడుతాడో చూడాలని ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాను చేసిన ఈ ట్వీట్ వర్మ వెంటనే తొలగించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications