
వీడియో: మేమేమైనా కడప రౌడీలమా? అంటూ వాదించిన టీడీపీ నేతకు అద్దిరిపోయే జవాబిచ్చిన డీఎస్పీ
అమలాపురం: రాష్ట్రంలో ఎక్కడ? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా దానికి ప్రాంతీయ రంగును పులుముతుంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు. కడప రౌడీలు, రాయలసీమ గూండాలు, ఫ్యాక్షనిస్టులు.. అంటూ ఆ ప్రాంత ప్రజలను కించపరిచేలా వ్యాఖ్యానిస్తుంటారు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాకు చెందిన నాయకుడు కావడం, రాయలసీమ జిల్లాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టు పట్టు ఉండటమే దీనికి ప్రధాన కారణం.
తెలుగుదేశం పార్టీ హయాంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తునిలో నిర్వహించిన సభ సమయంలో చోటు చేసుకున్న అల్లర్లు, రైలును తగులబెట్టినప్పుడు కూడా ఇది కడప రౌడీల పనేనంటూ స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆ తరువాత అరెస్టయిన వారిలో ఒక్కరు కూడా కడపకు చెందిన వారు గానీ, రాయలసీమవాసులు గానీ లేరు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ కాలిపోవడం, పోలీస్ స్టేషన్ ధ్వంసం.. అప్పట్లో 130 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు వార్తలొచ్చాయి.

అప్పటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి ఆందోళనలు జరిగినా దాని వెనుక కడప, పులివెందుల రౌడీలు, రాయలసీమ గూండాలు, ఫ్యాక్షనిస్టులు ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తూ వస్తోన్నారు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడూ టీడీపీ నాయకుల నుంచి అవే ఆరోపణలు తరచూ వినిపిస్తోన్నాయి.
ఇప్పుడు తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో స్థానిక టీడీపీ నాయకులు అలాంటి ఆరోపణలే గుప్పించే ప్రయత్నం చేశారు. తామేమైనా కడప రౌడీలమా? అంటూ ఏకంగా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం, అధికార వైఎస్ఆర్సీపీ నాయకుల వైఖరిని నిరసిస్తూ స్థానిక టీడీపీ నాయకులు మండపేటలో ఓ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని అడ్డుకున్న రామచంద్రాపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డితో వాగ్వివాదానికి దిగారు.
మేమేమైనా కడప రౌడీలమా? అంటూ వాదించిన టీడీపీ నేతకు అద్దిరిపోయే జవాబిచ్చిన డీఎస్పీ#Kadapa #tdp2022 #Appolice pic.twitter.com/MhY8DIq6K8
— oneindiatelugu (@oneindiatelugu) August 24, 2022
ర్యాలీని ఎందుకు అడ్డుకుంటారంటూ నిలదీశారు. మేమేమైనా కడప రౌడీలమా?.. రాయలసీమ ఫ్యాక్షనిస్టులమా?.. అంటూ వాదించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు డీఎస్పీ బాలచంద్రారెడ్డిని ఆగ్రహానికి గురి చేశాయి. పద్ధతి మార్చుకో.. కడప వాళ్లంటే అంత లోకువగా ఉందా?..నోటికొచ్చినట్టు మాట్లాడితే లోపలేస్తా..అని వార్నింగ్ ఇచ్చారు.