వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమాధి బాధిస్తోంది: కిరణ్‌కు రాపోలు, 'జగన్‌కు వీడ్కోలే'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rapolu Anand Bhaskar
న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా తిరుపతిలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చిత్ర పటానికి పలువురు సమైక్యవాదులు సమాధి కట్టడంపై కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఘాటైన లేఖ రాశారు.

సోనియాకు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సమాధి కట్టడం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రెండు ప్రాంతాలలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరించే వారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

నిష్పక్షపాతంగా వ్యవహరించాలి: శ్రీనివాస్ గౌడ్

సీమాంధ్ర అధికారులు రాష్ట్రానికి సంబంధించిన అఫ్పులు, ఆస్తులు, పరిశ్రమల వివరాలు రేపటిలోగా కేంద్రానికి ఇవ్వకపోయినా, తప్పుడు సమాచారమిచ్చినా వారిపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో మాట్లాడారు. గతంలో పక్షపాతంగా వ్యవహరించి ఆస్తులు, అప్పుల వివరాలపై తప్పుడు సమాచారమిచ్చి కేంద్రానని తప్పుదోవ పట్టించారన్నారు.

వీడ్కోలు సభ: దేవీ ప్రసాద్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో నిర్వహించనున్న సమైక్య సభ వీడ్కోలు సభేనని ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ వేరుగా అన్నారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఐకాస సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం తాము మరోసారి భేటీ అవుతామన్నారు. మంత్రుల బృందం దృష్టికి తీసుకు వెళ్లాల్సిన అంశాలపై చర్చిస్తున్నట్లు తెలిపారు.

English summary
Rajya Sabha Member Rapolu Anand Bhaskar on Wednesday wrote a letter to CM Kiran Kumar Reddy over Samadhi to AICC president Sonia Gandhi's flexi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X