వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

''చంద్రబాబుగారూ.. నన్ను క్షమించండి'': రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు

|
Google Oneindia TeluguNews

ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు. తాను క్షణికావేశంలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసివుంటే క్షమించాలన్నారు. ప్రజల తరఫున, వైసీపీ శ్రేణుల తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. క్షమాపణలు చెప్పడానికి ముందు రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తనపై, తన కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ నేతలు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, ఇదంతా ఐటీడీపీ ఆదేశాలతోనే జరుగుతోందని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.

అసలేం జరిగిందంటే..?

అసలేం జరిగిందంటే..?


రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. హత్యా రాజకీయాలు మొదలుపెడితే మొదట చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ నుంచే మొదలుపెడతామన్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆ సమయంలో విశాఖపట్నంలో ఉన్నప్రకాష్ రెడ్డి స్పందించారు. తన సోదరుడు మాట్లాడిన భాష తప్పని, కానీ భావం మాత్రం సరైందేనని సమర్థించారు. వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేల వ్యక్తిత్వ హననానికి టీడీపీ పాల్పడుతోందని, గెలవడం చేతకాక తమమీద ఆరోపణలు చేస్తున్నారన్నారు.

పరిటల శ్రీరామ్ బెదిరింపులు వెనక చంద్రబాబు?

పరిటల శ్రీరామ్ బెదిరింపులు వెనక చంద్రబాబు?


పరిటాల శ్రీరామ్ బెదిరింపులు వెనక చంద్రబాబు, లోకేష్ ఉన్నారని, రాప్తాడు ఎమ్మెల్యేకి టైం దగ్గర పడిందని చంద్రబాబు మాట్లాడుతున్నారని, అంటే చంపుతారా? అని ప్రశ్నించారు. అయితే అదే సమయంలో టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత నాయకులు అక్కడకు చేరుకొని నిరసనకు దిగారు. చంద్రబాబు, లోకేష్ కు ప్రకాష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్టేషన్ ఎదుట బైఠాయించిన పరిటాల సునీత, శ్రీరామ్

స్టేషన్ ఎదుట బైఠాయించిన పరిటాల సునీత, శ్రీరామ్


చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బత్తలపల్లి మండలానికి చెందిన టీడీపీ నాయకుడు గంటాపురం జగ్గు ఖండించారు. అదేరోజు అర్థరాత్రి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.జగ్గును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనికి కారణం తోపుదుర్తి బ్రదర్స్ అని, దిగజారి మాట్లాడుతున్నారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుకు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణుగుతుందో లేదంటే మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

English summary
Topudurthi Chandrasekhar Reddy, brother of Raptadu MLA of the joint Anantapur district, Topudurthi Prakash Reddy, apologized to Telugu Desam Party chief Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X