అక్కడ రైతన్న లకు పెద్ద కష్టం.. వరి పొలాలపై ఎలుకల దండయాత్ర!

ఉమ్మడి గోదావరి జిల్లా రైతులకు కొత్త కష్టం వచ్చింది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈ సీజన్‌లో వరి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలుకలు పంటను కొరికేస్తూ భారీ నష్టం కలిగిస్తున్నాయి. ఎలుకలు వరి కాండాలను నిలువునా కొరికి వేస్తుండటంతో ఎకరాకు రెండు నుంచి నాలుగు బస్తాల వరకు దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

రైతులు ఈ పంటలు సాగుచేస్తే రైతుభరోసాతో పాటు రూ.8వేల అదనపు ఆదాయం!
రైతులు ఈ పంటలు సాగుచేస్తే రైతుభరోసాతో పాటు రూ.8వేల అదనపు ఆదాయం!

ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో పంటల విషయంలో ఆందోళనతో ఉన్న రైతులకు ఎలుకలు కొత్త కష్టం తెచ్చి పెట్టాయి. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎలుకల సంతతి వేగంగా పెరిగింది. గత ఆగస్టు నెలాఖరులో వ్యవసాయ శాఖ అధికారులు నిర్మూలన కార్యక్రమం నిర్వహించినా, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఇప్పుడు పంట పొట్ట, ఈనిక, గింజ పాలుపోసుకునే కీలక దశలో ఉంది. దీంతో ప్రస్తుతం ఎలుకలు మరింత తీవ్రంగా దాడి చేస్తున్నాయి.

Rat Menace Devastates Paddy Fields in east and west Godavari Districts Farmers Spend Over 3500 Per Acre on Control Measures

ఈ సీజన్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4.25 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ముందుగా నాటిన పొలాల్లో ఈ నెలాఖరు నుంచి కోత ప్రారంభం కావచ్చని రైతులు ఆశిస్తున్నారు. కానీ సరిగ్గా ఇదే సమయంలో చిన్న పందికొక్కులు, చిట్టెలుకలు పంటను నాశనం చేస్తున్నాయి. రైతులు ఒక్కో ఎలుకను పట్టేందుకు రైతులు రూ.100కు పైగా ఖర్చు పెడుతున్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 9 నుంచి 10 సార్లు ఎలుకల నివారణా చర్యలు చేపట్టారు.

ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. నష్టాల్లో ఆ రైతులు!
ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. నష్టాల్లో ఆ రైతులు!

దీనివల్ల ఎకరాకు రూ.3,500కు పైగా ఖర్చు అయిందని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో ఎలుకల వల్ల రూ.100 కోట్లకు పైగా నష్టం జరిగి ఉండొచ్చని అంచనా.గతంలో కూడా గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఎలుకల బెడద ఉండేది. దీనివలన ప్రతి సంవత్సరం 5 నుంచి 15 శాతం వరకు పంట నష్టం జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎలుకలు రాత్రిపూట ఎక్కువగా చురుకుగా ఉండి, గింజలు పాలుపోసుకునే దశలో ఎక్కువ నష్టం కలిగిస్తాయి.

రైతులు బుట్టలు, సాంప్రదాయిక పద్ధతులు, రసాయన ఎరలు కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పంట కోత సమయం దగ్గరపడుతున్నందున రైతులు వెంటనే తగిన నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే ఈ సీజన్‌లో కూడా రైతులు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+