కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుల వేళ ఊహించని విధంగా..!!

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ లబ్దిదారుల సహనానికి పరీక్షగా మారుతోంది. ప్రభుత్వం చెప్పిన విధంగా వాట్సాప్ గవర్నెన్స్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించ లేదు. ఆన్ లైన్ లో సర్వ ర్ పై ఒత్తిడి పెరిగి సమస్యలు వస్తున్నాయి. దీంతో, లబ్ది దారులు పెద్ద సంఖ్యలో వార్డు, గ్రామ సచి వాలయాలకు పరుగులు తీస్తున్నారు. అంచనాలకు మించి దరఖాస్తులు వస్తున్నాయి. 10 రోజుల్లో నే 2,44,889దరఖాస్తులు వచ్చాయి. ఊహించని విధంగా వస్తున్న దరఖాస్తులతో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

వరుస సమస్యలు
కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తున్న అర్జీదారులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ఒకేసారి భారీస్థాయిలో దరఖాస్తులు వస్తుండటంతో సర్వర్లపై ఒత్తిడి పెరిగి, దరఖాస్తులు ఆన్‌లైన్‌ కావడం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే కాకుండా ఈనెల 15వ తేదీ నుంచి వాట్సా ప్‌ గవర్నెన్స్‌ (మన మిత్ర) ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొన్నా.. ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలకు దర ఖాస్తుదారుల తాకిడి విపరీతంగా పెరిగింది. సర్వర్లు పనిచేయకపోవడంతో దరఖాస్తులు ఆన్‌లైన్‌ కావడం లేదంటూ అక్కడి ఉద్యోగులు వెనక్కి పంపిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో అర్జీదారులు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మండుటెండలో పాట్లు పడుతున్నారు.

ration-card-applicants-facing-problems-rush-in-secretariats

అమలు కాని నిర్ణయం
రాష్ట్రంలోని అర్హులందరికీ కొత్త రేషన్‌ కార్డుల జారీతోపాటు ఇప్పటికే ఉన్న కార్డుల విభజన, సభ్యుల చేర్పులు, తొలగింపులు, చిరునామాల మార్పు, అనర్హుల కార్డుల సరెండర్‌, ఆధార్‌ సీడింగ్‌ను సరిచేసుకోవడం తదితర 10 రకాల సేవల కోసం దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఈనెల 7 నుంచి అనుమతి ఇచ్చింది. జూన్‌లోనే కొత్త రేషన్‌కార్డులు అందజేస్తామని పౌర సరఫ రాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించడంతో ఏళ్ల తరబడి రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తు న్న వారంతా దరఖాస్తు ఫారాలు పట్టుకుని సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. కొత్తగా పెళ్లి చేసుకొని, వేరు కాపురాలు పెట్టుకున్న జంటలతోపాటు అర్హతలు ఉన్న పేద కుటుంబాల వారు పోటెత్తుతున్నారు. దీంతో అర్జీదారుల హడావుడితో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు కిటకిటలాడు తున్నాయి.

భారీగా దరఖాస్తులు
ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా దరఖాస్తు అవకాశం కల్పిస్తే ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. కొత్త రైస్‌ కార్డులు, ఇతర సేవల కోసం దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ఈనెల 7 నుంచి 16వ తేదీ వరకు 10 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 2,44,889 దరఖాస్తులు అందాయి. వీటిలో కొత్త కార్డుల కోసం 30,614, ఉన్న కార్డుల విభజన కోసం 20,392, కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పుల కోసం 1,79,523, సభ్యుల తొలగింపు కోసం 6,397, తప్పు ఆధార్‌ సీడింగ్‌ను సరిచేయడానికి 3,743, కార్డుల సరెండర్‌ కోసం 260, చిరునామా మార్పు కోసం 3,799 మంది దరఖాస్తులు చేసుకోగా.. రేషన్‌ షాపుల రెన్యువల్స్‌ కోసం 161 దరఖాస్తులు వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+