రేషన్ కార్డు దారులకు శుభవార్త , నేటి నుంచి కొత్తగా - ధరలు ఫిక్స్..!!
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ సరఫరాలో కీలక మార్పులు తీసుకొచ్చింది. రేషన్ వాహనాల స్థానంలో తిరిగి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు. అదే విధంగా స్మార్ట్ కార్డుల ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక.. రేషన్ సరఫరాలో ఇప్పుడు కొత్త మార్పులు తెస్తోంది. నేటి నుంచి కొత్తగా మరిన్ని సరుకులు అందిస్తోంది. ఇదే సమయంలో రేషన్ కార్డు దారులకు కీలక సూచనలు చేస్తోంది.
ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుంచి రేషన్ కార్డు దారుల కోసం కొత్త నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాల్లో ఇకపై బియ్యంతో పాటు గోధుమ పిండి కూడా అందించనుంది. ఈ మేరకు ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో రూ.20కే గోధుమ పంపిణీ చేయనుంది. ఆదివారం నుంచి జిల్లా కేంద్రాల్లోని రేషన్ షాపుల్లో అందించనుండగా.. త్వరలో డివిజన్, మండల స్థాయిలో కూడా పంపిణీ చేయనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు రేషన్ కార్డు దారులకు కేజీ రూ.20కే అందించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రేషన్ కార్డు లబ్దిదారులకు బియ్యంతో పాటు రాగులు, జొన్నలు, చక్కెర వంటి నిత్యావసర సరుకులు అందిస్తోంది. ఇప్పుడు ఆదివారం నుంచి గోధుమ పండి కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతీ నెలా ఒక్కో లబ్దిదారుడికి కిలో చొప్పున గోధుమ పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్ లో గోధుమ పిండి దాదాపు రూ 60 నుంచి రూ 65 వరకు ఉంది. రేషన్ షాపుల ద్వారా రూ 20 కే అందించనున్నారు.

కీలక మార్పులు
రేషన్ కార్డు దారులకు ప్యాకెట్ల ద్వారా ఈ పిండిని అందించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే గోధుమ పిండి ప్యాకెట్లను రేషన్ షాపులకు పౌరసరఫరాల శాఖ సరఫరా చేసింది. వీటిని డీలర్లు లబ్దిదారులకు నేటి నుంచి అందించనున్నారు. రేషన్ సరుకుల జాబితాలో మరో నిత్యావసర వస్తువును చేర్చడంతో సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గత డిసెంబర్ నుంచి రేషన్ షాపుల ద్వారా రాగులు, జొన్నలు పంపిణీ చేస్తోంది. ఇందుకోసం బియ్యం కోటాను తగ్గించి వీటిని లబ్దిదారులకు అందిస్తోంది. ఇక రేషన్ దుకాణాలను మినీ మాల్స్ గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా రోజంతా సరుకులు అందించే కార్యక్రమానికి సిద్దమైంది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా పలు నగరాలను ఎంచుకున్నారు. ఇక్కడ సుమారు 12 గంటల పాటు షాపు తెరిచి ఉంచుతారు. ప్రస్తుతం నెలలో కేవలం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే షాపులు ఓపెన్ చేసి ఉంటున్నాయి.
-
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు రేపే-లోకేష్ కీలక ప్రకటన..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్-ఉత్తీర్ణతా శాతాలివే..! సప్లిమెంటరీ షెడ్యూల్..! -
AP Inter Results 2026 Release: ఇంటర్ ఫలితాల విడుదల -ఇలా చెక్ చేసుకోండి..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!!












Click it and Unblock the Notifications