ఎవరి కోసమో కాదు: బెజవాడపై రావెల, రఘువీరా ఫైర్
హైదరాబాద్: ఎవరో కొంత మందికి ప్రయోజనం చేకూర్చడాికి తాము విజయవాడను ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిగా చేసుకుంటున్నామనే వ్యాఖ్యల్లో నిజం లేదని రాష్ట్ర మంత్రి రావెల కిశోర్ బాబు అన్నారు. విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఎంపిక చేసుకోవడంపై విమర్శలు, వ్యతిరేకత ఎదురు కావడంతో ఆయన ఆ విషయంపై వివరణ ఇచ్చారు.
రాజధాని ఏర్పాటు చేయాలంటే కొన్ని ప్రమాణాలు అవసరమని, ఆ ప్రమాణాలు అమలు చేయాలంటే ఓ తాత్కాలిక రాజధాని అవసరమని, అందుకే తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఎంపిక చేసుకున్నామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
హైదరాబాదులో ప్రణాళికలు వేసుకుని విజయవాడలో అమలు చేస్తామని రావెల చెప్పారు. రాజధాని వికేంద్రీకరించి ఉండాలి కాబట్టే విజయవాడను ఎన్నుకున్నామని ఆయన అన్నారు.

కాగా, తాత్కాలిక రాజధానికి తాము వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రహస్య ఎజెండాను అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో డబ్బు సంచులు మోసినవారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.
శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఇవ్వకుండానే రాజధానిపై ఎందుకు తొందర పడుతున్నారని ఆయన విమర్శించారు. పంట భూముల్లో రాజధాని ఏర్పాటుమంచిది కాదని ఆయన అన్నారు. రాజధాని ఎంపిక విషయంపై వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలూ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశఆరు.












Click it and Unblock the Notifications