పిడుగుపాటుకు ఎగిరిపడ్డారు
గుంటూరు: పిడుగు పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన ఏపీలోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగింది. ప్రత్తిపాడు మండల పరిధిలోని రావిరాటిపాలెంకు చెందిన 11 మంది మహిళలు ఓ మిరపతోటలో మిర్చి నారు పనులకు వెళ్లారు. మధ్యాహ్నం జోరు వాన కురిసింది. మహిళలు చెట్టు కిందకు చేరారు. వర్షం తగ్గాక మిర్చి నారు తీసేసేందుకు వెళ్లగా.. పిడుగు పడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడి విసిరేసినట్లు పడిపోయారు. కాంతమ్మ అనే మహిళ అక్కడికి అక్కడే మృతి చెందారు. వారి కుటుంబాన్ని మంత్రి రావెల పరామర్శించారు. రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి వైద్య సాయం అందించాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications