విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘పద్మలత’ వల్లే రాజును డీఎస్పీ హత్య చేయించాడు: ‘బ్యాంకాక్‌లోనే స్కెచ్!’

రౌడీ షీటర్‌ గేదెల రాజును హత్య చేయించింది డీఎస్పీ రవిబాబేనని విశాఖపట్నం పోలీసులు స్పష్టం చేశారు. శనివారం రవికుమార్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంగా వారు మీడియాకు హత్యకు సంబంధించిన వివరాలను వెల్ల

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: రౌడీ షీటర్‌ గేదెల రాజును హత్య చేయించింది డీఎస్పీ రవిబాబేనని విశాఖపట్నం పోలీసులు స్పష్టం చేశారు. శనివారం రవికుమార్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంగా వారు మీడియాకు హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

రాజును హత్య చేయించింది రవిబాబే..

రాజును హత్య చేయించింది రవిబాబే..

తమ విచారణలో గేదెల రాజును హత్య చేయించింది రవిబాబేనని తేలిందని పోలీసులు చెప్పారు. రవిబాబు విచారణలో కొత్త విషయాలు బయటపడ్డాయని తెలిపారు. పోలీసుల విచారణతో రవిబాబు చెప్పిన విషయాలు సరిపోలాయని చెప్పారు. ఈ హత్య కేసు వ్యవహారంలో ఓ నాయకురాలి హస్తం ఉందని తెలిసిందని, మీడియా అన్నట్లుగా రాజకీయ నాయకులు ఉన్నట్లు తమకు సమాచారం లేదని, దర్యాప్తులు అన్ని విషయాలను తేలుస్తామని చెప్పారు.

పద్మలత, రాజు హత్యలు: ప్రధాని నిందితుడు డీఎస్పీ రవిబాబు లొంగుబాటుపద్మలత, రాజు హత్యలు: ప్రధాని నిందితుడు డీఎస్పీ రవిబాబు లొంగుబాటు

ఆ గ్యాంగ్‌తో హత్యకు కుట్ర

ఆ గ్యాంగ్‌తో హత్యకు కుట్ర

గేదెల రాజుకు రూ.25లక్షలు ఇచ్చేందుకు రవిబాబు అంగీకరించాడని, అయితే, అతని వేధింపులు భరించలేక హత్య చేసేందుకు కుట్రపన్నాడని తెలిపారు. సల్లూరు సుధీర్ బాబుకు చెందిన గెస్ట్ హౌజ్‌లో గేదెల రాజు, రవిబాబు గొడవపడ్డారని తెలిపారు.
భూపతిరాజు, శ్రీనివాసరాజులతో కలిసి గేదెల రాజుకు హత్యకు ప్లాన్ వేశారని చెప్పారు.
అక్టోబర్ 6న భూపతి రాజు గ్యాంగ్.. గేదెల రాజును హతమార్చిందని తెలిపారు. కాగా, రవిబాబు కుమారుడు రాహుల్ అకౌంట్ నుంచి భూపతిరాజుకు రూ.5లక్షలు బదిలీ చేసినట్లు గుర్తించామని తెలిపారు. 2013లో బ్యాంకాక్ ఎవరెవరు వెళ్లారనేది తెలియదని అన్నారు. హత్య కేసులో నిందితులైన మిగితా ఏడుగురి వివరాలను కూడా చెబుతామని అన్నారు. గేదెల రాజు హత్యకు మాజీ ఎమ్మెల్యే కూతురు పద్మలత వ్యవహారమే కారణమని చెప్పారు.

రూ.10 లక్షల చెక్కు సీజ్‌...

రూ.10 లక్షల చెక్కు సీజ్‌...

కాగా, గేదెల రాజు హత్య కోసం రవిబాబు ఇచ్చిన రూ.10 లక్షల చెక్కును విచారణాధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. జీవీఎంసీ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు కె.రమణ, శ్రీనివాస్‌ల సమక్షంలో పోలీసు అధికారులు చెక్కును స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ ఇచ్చిన చెక్కును భూపతిరాజు శ్రీనివాసరాజు ఒక ఫైనాన్షియర్‌కు ఇచ్చి తొలుత రూ.4 లక్షలను తీసుకున్నట్టు సమాచారం. ఆ నగదునే కిల్లర్లకు చెల్లించినట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ ఫైనాన్షియర్‌ నుంచి చెక్కును స్వాధీనం చేసుకున్నారు.

బ్యాంకాక్‌లో స్కెచ్..

బ్యాంకాక్‌లో స్కెచ్..

గతంలో రవిబాబు బృందం గాజువాకలోని తన బినామీలు, అనుచరులతో కలిసి బ్యాంకాక్‌ వెళ్లినట్లు సమాచారం. ఆ టూర్‌కు గేదెల రాజును కూడా ఆహ్వానించినప్పటికీ అతడు వెళ్లలేదు. గేదెల రాజు బ్యాంకాక్‌ వస్తే అక్కడ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి, వీలుకాకపోతే అంతమొందించాలన్న ఆలోచనతోనే అతడిని కూడా ఆహ్వానించామని రెస్టారెంట్‌ నిర్వాహకుడు చెప్పినట్టు సమాచారం. అక్కడైతే ఎవరికీ ఎటువంటి అనుమానం వచ్చే అవకాశం లేదనే ఉద్దేశంతో ఈ పథకం వేసినట్టు విచారణాధికారులకు వివరించినట్లు తెలిసింది. బ్యాంకాక్‌లో బినామీలందరితోను చర్చించిన తరువాత గేదెల రాజును వదిలించుకుందామనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

English summary
Visakhapatnam Police on Saturday said that DSP Ravi Babu is main accused in Gedela Raju murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X