వందలసార్లు: టీవీ9 అమ్మకం పుకార్లపై రవిప్రకాష్ వ్యంగ్యం
హైదరాబాద్: టీవీ9ను విక్రయిస్తున్నారనే పుకార్లకు ఆ మీడియా సంస్థ సిఇవో రవి ప్రకాష్ పుల్‌స్టాప్ పెట్టారు. టీవీ9ను మై హోం రామేశ్వర రావు కొనుగోలు చేస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే రవి ప్రకాష్ ఆ ఊహాగానాలకు తెర దించారు. ఆ పుకార్లపై వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశారు.
ఆర్పీగా ప్రసిద్ధుడైన రవిప్రకాష్ సూపర్ ఫైన్ ఎంటర్టైన్‌మెంట్ వెబ్‌సైట్‌కు ఇచ్చినట్లు చెబుతున్న ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. టీవీ9ను విక్రయిస్తున్నట్లు పుకార్లు రేపినవారిపై ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. టీవీ9 వందల సార్లు అమ్ముడుపోయిందని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

టీవీ9ను విక్రయించడానికి మో హోం గ్రూప్‌తో ఏ విధమైన డీల్ కుదరలేదని ఆయన స్పష్టం చేశారు. నిజానికి రాజకీయ నాయకులతో వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం తనకు ఇష్టం లేదని కూడా చెప్పారు. అలాంటి ఒప్పందాలు అనైతకని, మీడియా రాజకీయాలకు దూరంగా స్వతంత్రంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలుగులోనే కాకుండా కొన్ని ఇతర భాషల్లో కూడా టీవీ9 తన ప్రత్యేకమైన శైలిని ప్రకటిస్తూ వస్తోంది. ప్రసారాల్లోనూ, సాంకేతిక పరంగానూ వార్తాకథనాల్లోనూ కార్యక్రమాల రూపకల్పనలోనూ తనదైన శైలిని, పద్ధతిని అది పాటిస్తూ వస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications