పవన్ కళ్యాణ్ తెలియకుండా మాట్లాడొద్దు, అలా లింక్ పెట్టొద్దు: రాయపాటి
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు సోమవారం నాడు కౌంటర్ ఇచ్చారు.
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు సోమవారం నాడు కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ విషయంలో పవన్ తెలుసుకొని మాట్లాడాలని అభిప్రాయపడ్డారు.
భూసేకరణ చేసిన తర్వాతనే తమకు అప్పగించారని రాయపాటి చెప్పారు. పవన్ కళ్యాణ్ తెలియకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు లింక్ పెట్టడం పైన కూడా రాయపాటి స్పందించారు. ఈ రెండు వేర్వేరు అన్నారు.

ప్రత్యేక హోదా కోసం జనవరి 26న విశాఖ ఆర్కే బీచ్‌లో నిరసన చేపడతారనే వార్తల పైన కేంద్రమంత్రి, టిడిపి నేత అశోక్ గజపతి రాజు స్పందించారు. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి చెందలేదో చెప్పాలన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు.
శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చిలో నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. సోమవారం ఆయన బడ్జెట్ ముందస్తు ప్రణాళికలో భాగంగా వివిధ శాఖలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ఖర్చుల ఆధారంగా ఆయా శాఖలకు నిధులను కేటాయించనున్నట్టు చెప్పారు. కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరిలో ఉన్నందు వల్ల వాస్తవిక బడ్జెట్‌ను రూపొందిస్తామన్నారు.
రెవెన్యూలోటు రూ.4వేల కోట్లుగా ఉందని, మూడేళ్లలో రెవెన్యూ లోటును సున్నాకు తీసుకు వస్తామని చెప్పారు. మూడేళ్లుగా శాఖలకు ఇచ్చిన నిధులు, ఖర్చుల పైన సమాచారం తీసుకుంటామన్నారు. బడ్జెట్ అంచనాల్లో కేటాయించిన నిధులు కాకుండా అదనపు నిధులు అడిగితే ఇచ్చేది లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications