20 సీట్లలో విన్, కిరణ్ కరెక్ట్: రాయపాటి, బొత్సపై ఫైర్

తమ కొత్త పార్టీకి సమయం రాలేదన్నారు. తాను ఢిల్లీకి రావడం ఆలస్యం కావడంతో సభాపతిని కలవలేకపోయానని, తాను స్పీకర్‌ను కలిసి రాజీనామాను ఆమోదింప చేసుకుంటానని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితిని ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ కాంగ్రెసులో విలీనం చేయరన్నారు.
తెలంగాణ ఇస్తే కాంగ్రెసు ఎన్ని స్థానాలలో గెలుస్తుందో సమైక్యంగా ఉంటే అంతకంటే ఎక్కువ సీమాంధ్రలో గెలుస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెసు సీమాంధ్రలో ఇరవై ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. సీనియర్లను కాదని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోను రాదని చెప్పారు.












Click it and Unblock the Notifications