జీవిత ఆశయం: టిటిడి చైర్మన్ పదవిపై రాయపాటి, మురళీ మోహన్‌ను పక్కన పెట్టేనా?

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ తన జీవిత ఆశయమని ఎంపీ రాయపాటి సాంబశివ రావు మంగళవారం నాడు అన్నారు. ఈ పదవి కోసం తాను ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు.

గుంటూరు: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ తన జీవిత ఆశయమని ఎంపీ రాయపాటి సాంబశివ రావు మంగళవారం నాడు అన్నారు. ఈ పదవి కోసం తాను ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు.

అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. టిటిడి చైర్మన్ కావాలనేది తన కోరిక అన్నారు. ముప్పై ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఏ డిమాండ్ చేయలేదన్నారు.

తాను ఎవరినీ, ఏ పదవి అడగలేదన్నారు. మంత్రి పదవిని కూడా అడగలేదని చెప్పారు. కానీ టిటిడి చైర్మన్ పదవి తన జీవిత ఆశయమని చెప్పారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడనని చెప్పారు. దేవుడికి సేవ చేస్తానని చెప్పారు.

Rayapati Sambasiva Rao Wants TTD Chairman Post

కాగా, టిటిడి చైర్మన్ రేసులో రాయపాటి సాంబశివ రావుతో పాటు మురళీ మోహన్, జ్యోతుల నెహ్రూ వంటి పలువురు నేతలు ఉన్నారు. చంద్రబాబు ఇప్పటికే మురళీ మోహన్ పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో రాయపాటి మరోసారి దీని గురించి మాట్లాడటం గమనార్హం.

టిటిడి చైర్మన్ పదవి విషయంలో చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారోననే ఆసక్తి అందరిలోను నెలకొంది. తనకు సన్నిహితుడైనా మురళీ మోహన్‌కు ఇస్తారా లేదా ఆయనను పక్కన పెట్టి రాయపాటికి ఇస్తారా చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+